సిల్లీ ఫెలోకి మహేష్ వార్నింగ్...!
on Sep 6, 2018
నాకు తెలుసు మీకు సిల్లీ ఫెలో అనగానే డాక్టర్ మోహన్ బాబు గుర్తుకువస్తారని. మహేష్ బాబు మోహన్ బాబుకి వార్నింగ్ ఇచ్చాడా అని అచర్చపోతున్నారా... అసలు విషయం ఏమిటంటే.... అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్‌లో వస్తున్నఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. ఈ చిత్రాన్ని రేపు (సెప్టెంబర్ 07)న రిలీజ్ చేస్తున్నారు దర్శకత నిర్మాతలు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ ‘సిల్లీ ఫెలోస్’గురించి మాట్లాడుతూ... పాత నరేష్ , పాత సునీల్ సినిమాలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది ఈ సినిమా.. ఆవిషయంలో గ్యారెంటీ ఇస్తాను.. ప్రొడ్యూసర్స్ మంచి హార్డ్ వర్క్ చేశారు.. ఈ సినిమా వారికి మరియు మాకు మంచి విజయం అందించాలని కోరుకుంటున్నాను.. హీరోయిన్స్ బాగా నటించారు.. ఈ సినిమాతో వారికి మంచి బ్రేక్ వస్తుంది.. అన్నారు.. అలాగే మహేష్ ‘మహర్షి’ చిత్రంలో తాను పోషిస్తున్న రవి క్యారెక్టర్ గురించి వివరిస్తూ... మహేష్‌కు ఓ పేద స్నేహితుడి పాత్రలో నటిస్తోన్న మాట వాస్తవమేనని, ఒక రకంగా ‘గమ్యం’ సినిమాలో గాలి శీను రోల్ తరహాలో ఉంటుందని, ఆ పాత్ర ఎలా అయితే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందో ఇది కూడా అలాగే అవుతుందని, ఇంతకుమించి ఏమీ చెప్పొద్దంటూ మహేష్ బాబు నుండి ‘స్వీట్’ వార్నింగ్ వచ్చిందంటూ చెప్పకనే చెప్పాడు ఈ సిల్లీ ఫెలో అల్లరి నరేష్. సో.. అది అసలు విషయం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
