బంగారు బుల్లోడుగా అల్లరోడు!!
on Dec 8, 2018
వరుస ఫ్లాప్ లతో విసిగిపోయిన అల్లరి నరేష్ తాజాగా ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే....అల్లరి నరేష్ కొత్త చి త్రానికి `బంగారు బుల్లోడు` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట చిత్ర యూనిట్. అయితే యూనిట్ లో అధిక భాగం ఈ టైటిల్ కే ఓ కే చెప్పడంతో దీన్నే కన్ ఫర్మ్ చేయాలన్న ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట. గతంలో బాలకృష్ణ, రమ్యకృష్ణ జంటగా నటించిగా విజయవంతమైన చిత్రమిది. ఇప్పుడు నరేష్ సినిమాకు ఈ టైటిల్ పెడుతున్నారు. గతంలో కూడా సుందరకాండ, యముడికి మొగుడు, అహనాపెళ్లంట లాటి పాత చిత్రాల టైటిల్స్ తో సక్సెస్ కొట్టాడు. మరోమారు ఓల్డ్ టైటిల్ తో వస్తున్న నరేష్ మరి ఆకట్టుకుంటాడో లేదో చూద్దాం.
ప్రజంట్ సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమా `మహర్షి`లో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఇ.సత్తిబాబు దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా ఓకే చేశాడు నరేష్. పేరడీ కామెడీతో విసిగిపోయిన నరేష్ ఇక మీదట కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. చూద్దాం ఇకనైనా సక్సెస్ ట్రాక్ లో పడతాడో లేదో!!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
