ఆ ఇద్దరికీ `సీమశాస్త్రి` సక్సెస్ ఇస్తాడా!!
on Nov 6, 2018
అల్లరి నరేష్ , జి. నాగేశ్వరరెడ్డి కలయికలో సీమశాస్త్రి, సీమటపాకాయ్, ఇంట్లో దెయ్యం నాకేం భయం చిత్రాలు వచ్చాయి. ఇందులో సీమశాస్త్రి, సీమటపాకాయ్ చిత్రాలు హిట్ చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం సీక్వెల్స్ పరంపర నడుస్తున్న క్రమంలో అల్లరి నరేష్ తో `సీమశాస్త్రి-2` చిత్రం చేయాలనుకుంటున్నాడట జి.నాగేశ్వరరెడ్డి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు కూడా జరుగుతున్నాయట. అల్లరి నరేష్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. జి.నాగేశ్వరరెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి ఇద్దరూ ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో వర్క్ చేస్తున్నారట. అల్లరి నరేష్ సరసన ఓ నూతన కథానాయిక ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రాన్ని ఓపేరున్న సంస్థ నిర్మించనుందట. ప్రస్తుతం అల్లరి నరేష్ మహేష్ బాబు నటిస్తోన్న `మహర్షి` చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. తన పాత్ర ఇప్పటికే చాలా వరకు పూర్తి కావొచ్చిందట. అలాగే ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమాలు పూర్తైన వెంటనే జి. నాగేశ్వరరెడ్డి సినిమా పట్టా లెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
