5 కోట్ల అబద్ధం !!
on Jul 1, 2013
అబద్ధమాడినా అతికినట్లుండాలని మన పెద్దలు ఎపుడూ చెబుతుంటారు. ఈ విషయం దర్శకశేఖరుడు గుణశేఖర్‌కి తెలిసినట్లు లేదు. అందుకే "రుద్రమదేవి" చిత్రం కోసం అక్షరాల అయిదు కోట్లు ఖర్చు చేసి ఒరిజినల్ నగలు చేయించామని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. "నగలు కోసమే అయిదు కోట్లు ఖర్చు చేసారంటె.. సెట్టింగ్స్ కోసం, సినిమా రూపకల్పన కోసం ఇంకెన్ని కోట్లు ఖర్చు చేస్తారో ఏమో" అని ప్రేక్షకులు గుండెల మీద చేతులు వేసుకోవాలన్నది గుణశేఖర్ ఆలోచన. నిజానికి.. నిజం బంగారం, వజ్రాలతో చేయించిన నగలకంటె.. డూఫ్లికేట్వే ధగధగలాడతాయి. పైగా రోజూ వేసి, తీసే ఆభరణాల లెక్క చూసుకోవడం, వాటిని కాపలా కాయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా సరే.. "రుద్రమదేవి" చిత్రంలో అనుష్క ధరించే ఆభరణాలన్నీ అసలైనవేనని అబద్ధాలాడేస్తున్నాడు ఈ చిత్రానికి నిర్మాత కూడా అయిన దర్శకుడు గుణశేఖర్. ఎవరి ఆనందం వారిది మరి!