Home

»

Latest News

తండ్రైన సుడిగాడు..!

Sep 29, 2016 11:01AM

అల్లరి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి..తొలి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు అల్లరి నరేష్. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎడాపెడా సినిమాలు చేసుకుంటూ రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి కామెడీ స్టార్‌గా‌ పేరు తెచ్చుకున్నాడు. 14 ఏళ్ల కెరిర్‌లో 50 చిత్రాలలో నటించి గత సంవత్సరం చెన్నైకి చెందిన విరూప అనే ఆర్కిటెక్ట్‌ను వివాహం చేసుకున్నాడు నరేష్. అల్లరి నరేష్ భార్య విరూప పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. తన కూతురిని ఎత్తుకుని దిగిన ఫోటోని నరేష్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన నరేశ్ అభిమానులు, సన్నిహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com