అల్లరి నరేష్.. సునీల్.. సిల్లీ ఫెలోస్...
on Jun 9, 2018
అల్లరి నరేష్.. కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చి, ప్రేక్షకులను నవ్విస్తూ ఇప్పటికే 50 కి పైన సినిమాలు చేసాడు.. ఇక సునీల్ కమెడియన్ ఎంట్రీ ఇచ్చి, మనల్ని కడుపుబ్బా నవ్వించి.. సిక్స్ ప్యాక్ చేసి, హీరో కూడా అయ్యాడు.. అయితే ఈ మధ్య వీరిద్దరి కామెడీ, ట్రాక్ తప్పింది.. మునుపటిలా మనల్ని నవ్వించి హిట్ కొట్టలేకపోతున్నారు.. అందుకే ఇప్పుడిద్దరూ కలిసి రావాలని ఫిక్స్ అయ్యారు.. మనల్ని కడుపుబ్బా నవ్వించి హిట్ కొట్టాలని చూస్తున్నారు.. ఇక ఈ హిట్ బాధ్యతని సుడిగాడు డైరెక్టర్ భీమినేని శ్రీనివాస్ భుజాన వేసుకున్నారు.. వీళ్ల ముగ్గురి కలయికలో 'సిల్లీ ఫెలోస్' అనే సినిమా వస్తుంది.. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే హిట్ కొట్టేలాగానే కనిపిస్తున్నారు.. చూద్దాం మరి ఈ 'సిల్లీ ఫెలోస్' సినిమాతో అయినా అల్లరి నరేష్, సునీల్ మళ్ళీ ఫామ్ లోకి వస్తారేమో....

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
