English | Telugu
వంగలపూడి అనిత సెటైర్స్.. ఆది తలకిందకి పెట్టి కాళ్ళు పైకిపెట్టిస్తా!
Updated : Dec 11, 2025
ఈనాడు 50 , ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 14 న వైజాగ్ లో ఘనంగా వేడుకులు జరగబోతున్నాయి. ఇక ఈటీవీ షోస్ నుంచి ఉన్న కళాకారులంతా కూడా వైజాగ్ వచ్చారు. పండు, పల్సర్ బైక్ ఝాన్సీ, సింగర్ సునీత, సుమ, ఆది, సౌమ్య శారద, ఈనాడు 50 , ఈటీవీ @ 30 , సుమ @16 అంటూ తన వయసు ఇంకా పదహారు అని వైజాగ్ స్టేజి మీద చెప్పేసరికి వంగలపూడి అనిత పకపకా నవ్వేసింది. నేను వైజాగ్ బీచ్ అనగానే ఇదంతా చూపించడానికి గైడ్ లు కూడా వచ్చేసారు అంటూ ఆదిని, పండుని చూపించింది. ఇక వాళ్ళు కూడా నవ్వేశారు. "సర్ నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చాను" అని సుమా అనేసరికి "మీరా విశాఖపట్నంలో ఇంటర్మీడియట్ అమ్మాయనుకున్నాను" అంటూ అయ్యన్నపాత్రుడు కామెంట్ చేశారు. "ఆవిడను ఇంటర్మీడియట్ అని పొగిడి మీరు 10th క్లాస్ కి వెళ్లిపోయారు తెలుసా" అంటూ ఆది అయ్యన్నపాత్రుడికి కౌంటర్ ఇచ్చాడు. దానికి అయ్యన్నపాత్రుడు నవ్వేశారు. "మీరు పాలిటిక్స్ కి ముందు టీచర్ గా కూడా చేశారు కదా ఒక వేళా నాలాంటి స్టూడెంట్ తగిలితే ఎం చేసేవాళ్ళు" అంటూ ఆది హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనితను అడిగాడు. "నేనైతే తల కిందకి కాళ్ళు పైకి పెట్టిస్తా" అంటూ ఆది మీద సెటైర్ వేశారు.
వెంటనే సుమ "నాకిప్పుడు ఇది చూడాలని ఉంది". ఇక ఈ ఈవెంట్ కి శంబాలా మూవీ టీమ్ నుంచి ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ వచ్చారు. ఇక సుమ, ఆది, సింగర్ సునీత ఆడియన్స్ లోకి వెళ్లి ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళతో కూడా ముచ్చటించారు. "నేను హీరోగా సుమ గారు హీరోయిన్ గ ఒక సినిమా చేయాలనీ అనుకుంటున్నా" అని రాసి ఉంది. మీరు పేరు చెప్పండి అని ఆది అనేసరికి అనిల్ కుమార్ అన్నాడు. జయమ్మ పంచాయతీ అనిల్ గారి ఆనవాయితీ..సినిమా పేరు అంటూ ఆది అతని మీద సెటైర్ వేసాడు. తర్వాత ఇంకో ప్లకార్డు చూసారు. "సునీత గారు నన్ను చూసి అందగాడా అందగాడా" అనే పాట పాడాలి అని రాసి ఉంది. వెంటనే సునీత ఆ సాంగ్ ని ఆడియన్స్ మధ్యలోనే నిలబడి పాడి వినిపించారు. ఇక వందేమాతరం శ్రీనివాస్ కూడా రాములమ్మ సాంగ్స్ పాడారు. తర్వాత వంగలపూడి అనిత స్టేజి మీదకు వచ్చి "ఒక నీతితో, నిజాయితీతో, నిబద్దతతో కళాకారులను ముందుకు తీసుకురావడమే కాకుండా ఢీ లాంటి షోస్ ని ఏర్పాటు చేయడం కానీ ఒక పాడుతా తీయగా లాంటివి ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి యువశక్తిని ముందుకు తీసుకొస్తున్న ఇటువంటి వాళ్లకు మనందరం కూడా సపోర్ట్ చేయాలి" అని చెప్పారు.