English | Telugu
Mid week elimination Bigg Boss 9 Telugu : మిడ్ వీక్ ఎలిమినేషన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. బిగ్ ట్విస్ట్!
Updated : Dec 11, 2025
బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వీక్ ఒకరు ఎలిమినేట్ అయితే ఇంకా ఆరుగురు ఉంటారు. ఫినాలే కి టాప్-5 ఉంటారు. కాబట్టి ఈ వీక్ ఒకరు లేదా నెక్స్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఇప్పటికే ఓటింగ్ లో సంజన, సుమన్ లీస్ట్ లో ఉన్నారు. గతవారమే వీళ్లలో ఎవరో ఒకరు వెళ్ళల్సింది కానీ అనూహ్యంగా రీతూ బయటకు వచ్చింది.
ఈ వారం వీకెండ్ లో సుమన్ ఎలిమినేట్ అవ్వడం పక్క.. మిడ్ వీక్ ఎలిమినేషన్ సంజన అవుతుందని అందరు అనుకుంటున్నారు. ఈ ఎలిమినేషన్ అనేది హౌస్ మేట్స్ నిర్ణయంపై ఆధారపడుతుంది. ఇప్పటివరకు ఏ సీజన్ లో అయిన మిడ్ వీక్ ఎలిమినేషన్ లో హౌస్ మేట్స్ అందరిని పిలిచి టాప్-5 కి అర్హత లేని వారిని డిసైడ్ అయి చెప్పమంటాడు బిగ్ బాస్. అలా అందరు ఒకరి పేరు చెప్పాలి. ఇప్పటికే హౌస్ లో జీరో పాయింట్స్ తో సంజన ఉంది. హౌస్ లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే అందరికంటే లీస్ట్ సుమన్.. కానీ సంజన, సుమన్ ఇద్దరు ఉంటే అందరు సంజనని సెలెక్ట్ చేసుకుంటారు. దాంతో తను మిడ్ వీక్ బయటకు వచ్చేస్తుంది.
టాప్-5 భరణి కన్ఫమ్. టాప్-5 లో పెట్టేందుకే భరణికి బూస్ట్ ఇచ్చి మరి రీఎంట్రీ ఇచ్చారు. అలాంటిది భరణి బయటకు వెళ్లే ఛాన్స్ లేదు. కళ్యాణ్, తనూజ,ఇమ్మాన్యుయేల్, డీమాన్, భరణి టాప్-5 కంటెస్టెంట్స్ అని అందరికి తెలిసిందే. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో సుమన్ , సంజన కాకుండా డీమాన్ గానీ భరణి గానీ బయటకు వస్తే బిగ్ బాస్ సీజన్-9 కి ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్ అవుతుంది. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.