English | Telugu
Jayam serial: నల్లపూసల కోసం గంగ వాళ్ళింటికి వెళ్ళిన రుద్ర.. పారు ఏం చేస్తుందంటే!
Updated : Dec 11, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -138 లో......రుద్ర దగ్గర ఉండి మరి గంగని బాగా చూసుకుంటాడు అది చూసి ఇషిక వీరు, పారు చూసి ఓర్వలేకపోతారు. గంగని దగ్గర ఉండి చూసుకొండి అని పెద్దసారు ఇంట్లో వాళ్లతో చెప్తాడు. అసలు అన్నయ్య మనకి ఛాన్స్ ఇవ్వడం లేదు.. తనే చూసుకుంటున్నాడని స్నేహ అంటుంది. గంగను వాళ్ళ పుట్టింటికి పంపింద్దామనుకుంటున్నాను.. తనతో పాటు రుద్రను కూడా అనగానే అందరు షాక్ అవుతారు.
అంటే నల్లపూసల తంతు పుట్టింట్లో చేస్తారు కదా అని పెద్దసారు అనగానే శకుంతల షాక్ అవుతుంది. స్నేహ వెళ్లి గంగకి చెప్పమని పెద్దసారు అంటాడు. అదంతా విని ఇషిక వీరు, పారు మాట్లాడుకుంటారు. వీళ్ళని ఇలా వదిలేస్తే విషయం చాలా దూరం వెళ్తుంది. పుట్టింటికి వెళ్లిన గంగ తిరిగి రాకుండా ప్లాన్ చేస్తానని పారు అంటుంది. అప్పుడే రుద్ర వచ్చి.. ఏదో ప్లాన్ అంటున్నావేంటి అని అడుగుతాడు. మైండ్ డిస్టబ్ గా ఉంది.. ఏదైనా టూర్ ప్లాన్ చెయ్యాలి అంటున్నానని పారు కవర్ చేస్తుంది. ఇంటికి గెస్ట్ గా వచ్చి ఇంతసేపు ఉండడం పద్ధతి కాదని తెలియదా.. నీ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్ వస్తే ఊరుకోనని రుద్ర వార్నింగ్ ఇస్తాడు. మరుసటి రోజు గంగ, రుద్ర రెడీ అవుతారు. మా ఇంట్లో రుద్ర సర్ కి ఏం లోటు లేకుండా చూసుకుంటాం.. మా పక్కింట్లో ప్రిడ్జ్ ఉంది.. గల్లీలో కూలర్ ఉంది అని గంగ చెప్తుంటే.. వాళ్ళని వీళ్ళని అడుక్కొచ్చి అల్లుడికి మర్యాద చేస్తారా అని శకుంతల వెటకారంగా మాట్లాడుతుంది.
ఆ తర్వాత గంగ,రుద్ర బయల్దేరతారు. గంగ, రుద్ర కలిసి గంగ వాళ్ళింటికి వెళ్ళగానే అందరు వచ్చి వాళ్ళిద్దరిని పలకరిస్తారు. ఎంతో రుద్ర ఇబ్బంది పడతాడు. ఇద్దరు గుమ్మం దగ్గరికి వస్తారు. లక్ష్మీ హారతి ఇస్తుంది. గంగ ఫ్రెండ్స్ రుద్రని ఆటపట్టిస్తారు. పేరు చెప్పి లోపలికి రమ్మని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.