English | Telugu
Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!
Updated : Dec 11, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.
శ్రీవల్లి ఆ పేపర్ లోది చూసి చందు రాసాడనుకొని మురిసిపోతుంది. అది పక్కన విసిరేస్తుంది. అది ప్రేమ పూల ప్లేట్ తీసుకొని వెళ్తుంటే అందులో పడుతుంది. ధీరజ్, ప్రేమ ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు. పేపర్ కింద పడడంతో తనదేమోననుకొని ప్రేమకి పేపర్ ఇస్తాడు. ప్రేమ అది చదివి ధీరజ్ రాసాడని సర్లే అడిగావు కదా సరే వెళదామని పేపర్ ధీరజ్ కి ఇవ్వగానే నువ్వు రాసి నేను రాసాను అంటున్నావా అని ధీరజ్ అనుకుంటాడు. ధీరజ్ ఆ పేపర్ ని పక్కన విసురుతాడు. అది నర్మద చూసి అటుగా వస్తున్న సాగర్ రాసాడనుకుంటుంది. సాగర్ కి ఆ పేపర్ ఇస్తుంది. అది నర్మద రాసి ఇచ్చిందనుకుంటాడు.
ఆ తర్వాత ఆ పేపర్ సాగర్ పక్కన పడేస్తాడు. అది తిరుపతికి దొరుకుతుంది. నాకోసం ఎవరో రాసారు.. నేను కచ్చితంగా ఈ రోజు పార్క్ కి వెళ్ళాలనుకుంటాడు. ఆ తర్వాత సాయంత్రం పార్క్ కి అమూల్య, విశ్వ వస్తారు. అమూల్య స్కార్ఫ్ కట్టుకుంటుంది. ప్రేమ, ధీరజ్. నర్మద, సాగర్. చందు, శ్రీవల్లి. తిరుపతి కూడా వస్తారు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అందరు పార్క్ కి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.