English | Telugu
Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!
Updated : Dec 11, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.
అదేం లేదు అత్తయ్య.. అతను నా పీఏ అని శ్రీధర్ అంటాడు. ఎవరికి చెప్పి తీసుకున్నారని జ్యోత్స్న కోప్పడుతుంది. నేను చెప్తే తీసుకున్నాడని శివన్నారాయణ సమాధానం చెప్తాడు. ఆ తర్వాత శ్రీధర్ ప్రెజెంటేషన్ ఇస్తాడు. దానికి దీప కొన్ని సలహాలు ఇస్తుంది. అవన్నీ అందరికి నచ్చుతాయి. ఇలాంటి ఆలోచనలు పెంచితే రావు.. అది పేరెంట్స్ నుండి వస్తుంది. దీప పేరెంట్స్ చాలా గొప్పొళ్ళు అని శివన్నారాయణ అనగానే.. మీ కొడుకుకోడలే దీప అమ్మానాన్న అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీధర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత పారిజాతం, దీప మాట్లాడుకుంటారు. ఆ దీప బలం పెరుగుతుందని జ్యోత్స్న అనగానే నీ గ్రాఫ్ తగ్గిపోతుందని పారిజాతం అంటుంది. కార్తీక్ స్వీట్ చేసి తీసుకొని వచ్చి అందరిని హాల్లోకి పిలుస్తాడు. నీ భార్య మంచి సలహా ఇచ్చినందుకు చేసావా అని పారిజాతం అంటుంది. ఇక దీపని జ్యోత్స్న బాధపెట్టాలని తన గతంలోకి వెళ్తుంది. దీప తన భర్తని జైలుకి పంపింది. బావ నచ్చి అతన్ని వదిలేసిందని జ్యోత్స్న అంటుంది. సుమిత్ర తనని కొట్టబోతుంటే సమాధానం చేత్తో కాదు అత్త.. మాటల్తో ఉండాలని కార్తీక్ అంటాడు. ఆమ్మో ఇప్పుడు వీడేం చేయబోతున్నాడో ఏంటో అని పారిజాతం భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.