English | Telugu
Bigg Boss 9 Telugu Tanuja: ఓటు అప్పీల్ చేసిన తనూజ.... మేడమ్ సర్ మేడమ్ అంతే!
Updated : Dec 11, 2025
బిగ్ బాస్ సీజన్-9 పదమూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక పద్నాలుగో వారం హౌస్ లో టాస్క్ లు కొనసాగుతున్నాయి. నామినేషన్ నుండి సేవ్ అవ్వాలంటే టాస్క్ లో పోటీపడుతూ స్కోర్ బోర్డు పై పాయింట్స్ ఎక్కువ కలిగి ఉండాలి. అలా టాస్క్ అనంతరం పాయింట్స్ ఎక్కువ ఉన్నవాళ్ళకి బిగ్ బాస్ ఓటు అప్పీల్ ఛాన్స్ కలిపించాడు. కాసేపటికి బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. అందులో తనూజ, భరణి, సంజన, సుమన్ నలుగురు పోటీ చేశారు. ఇమ్మాన్యుయల్, డీమాన్ సంఛాలక్ గా ఉన్నారు.
ఈ టాస్క్ త్వరగా పూర్తి చేసిన వారికి ఎక్కువ పాయింట్స్ వస్తాయని బిగ్ బాస్ చెప్పాడు. మొదటగా సంజన టాస్క్ పూర్తి చేసినా కొన్ని మిస్టేక్స్ చేసింది.. అలాగే తనూజ కూడా మిస్టేక్ చేసింది. ఆ తర్వాత ప్రాపర్ గా భరణి చేస్తాడు. ఈ గేమ్ ముగిసే సమయానికి భరణికి 100 పాయింట్లు, తనూజకి 80 పాయింట్లు, సంజనకి 60 పాయింట్లు, సుమన్ కి 40 పాయింట్లు వస్తాయి. ఇక లీడర్ బోర్డు లో భరణి, తనూజ టాప్ లో ఉంటారు. వాళ్ళిద్దరికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్. వాళ్ళు గార్డెన్ ఏరియాలోకి వెళ్తారు. అక్కడ బయట నుండి వచ్చిన ఆడియన్స్ ఉంటారు. భరణి గురించి పాజిటివ్ గా మాట్లాడుతారు. మీరు ఎవరికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారని బిగ్ బాస్ అడుగగా ఎక్కువ తనూజకి సపోర్ట్ చేస్తారు.
దాంతో భరణి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత తనూజ ఓటు అప్పీల్ స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆడియన్స్ తనూజని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఒకతను మీకు ఫ్యాన్ బాయ్ వస్తాడు. మేడం సర్ మేడం అంతే అని చెప్పగానే తనూజ మురిసిపోతుంది. ఈ సారి లేడీ విన్నర్ గా చూడాలి అనుకుంటున్నామని మరొకరు చెప్పగానే.. తప్పకుండా అని తనూజ హ్యాపీగా ఫీల్ అవుతుంది.