English | Telugu

బిగ్ బాస్-5 లో ఊహించని ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన సిరి!

'బిగ్ బాస్ 5 తెలుగు' చివరి దశకు చేరుకుంది. టైటిల్ రేసులో సన్నీ, షణ్ముఖ్‌, శ్రీరామ్ చంద్ర, సిరి, మానస్ ఉన్నారు. అయితే సన్నీ, షణ్ముఖ్‌, శ్రీరామ్ చంద్ర ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ 5 టైటిల్ గెలిచే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తాజాగా టాప్ 5 లో ఉన్న సిరిని ఎలిమినేట్ చేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

Also Read:నా దునియాల నేను హీరోనే: స‌న్నీ

బిగ్ బాస్ 5 శుక్రవారం(ఈరోజు) ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో సిరిని ఎలిమినేట్ చేసినట్లు చూపించారు. ప్రోమోలో మొదట బిగ్ బాస్ ఐదుగురు ఇంటి సభ్యులని తమ లగేజ్ తీసుకొని గార్డెన్ ఏరియాకి రమ్మన్నాడు. ఆ తర్వాత, 'ఈ ఇంట్లో మీలోని ఒకరి ప్రయాణం ఈ క్షణమే ముగుస్తుంది.. మీ అభిప్రాయం ప్రకారం ఎలిమినేట్ అయ్యే సభ్యులు ఎవరో చెప్పండి' అని బిగ్ బాస్ అడగగా.. మానస్, సన్నీ లు షణ్ముఖ్ పేరు చెప్పారు. అలాగే షణ్ముఖ్ సన్నీ పేరు చెప్పగా.. శ్రీరామ్ సిరి పేరు చెప్పాడు. అనంతరం 'ఇంటి నుండి బయటకు వెళ్తున్న సభ్యులు సిరి' అని బిగ్ బాస్ చెప్పగా.. మొదట 'నేను వెళ్ళను.. బిగ్ బాస్ మీరు జోక్ చెయ్యట్లేదు కదా' అని అడిగిన సిరి.. ఆ తర్వాత ఇంటి నుండి వెళ్ళిపోతూ ఏడ్చేసింది. సిరి వెళ్లిపోవడంతో షణ్ముఖ్ ఏడుస్తూ కనిపించాడు.

Also Read:నిన్న‌టి వ‌ర‌కు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్ప‌డు పెళ్లాం?

విన్నర్ ఎవరో తెలియడానికి కేవలం 48 గంటల ముందు బిగ్ బాస్ నిజంగా సిరిని ఎలిమినేట్ చేస్తాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరిని సీక్రెట్ రూమ్ లో ఉంచి.. ఎపిసోడ్ చివరిలో బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తాడేమో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.