English | Telugu

Ilu illalu pillalu : శోభని రౌడీల దగ్గరి నుండి తీసుకొచ్చిన వేదవతి అండ్ కో.‌. ధీరజ్ సేఫ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -304 లో.....అత్త ముగ్గురు కోడళ్ళు కలిసి శోభని వెతకడానికి వెళ్తారు. ధీరజ్ ని గుర్తు చేసుకొని వేదవతి ఎమోషనల్ అవుతుంటే నర్మద ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత శోభని ఎలా కనుక్కోవాలని ఆలోచిస్తారు. అందరం ఒక్కో ఇంటికి వెళ్ళాలని శ్రీవల్లి ఐడియా ఇస్తుంది. పనికిరాని తెలివే అనుకున్నా కానీ బానే చెప్పావని నర్మద అంటుంది.

అందరు వాళ్ళ అవతారాలు మార్చి చేతిలో బుక్ మెడలో ఐడి కార్డ్ వేసుకొని ఇంటింటికి వెళ్తారు. శోభ కి సంబంధించినది ఏం కన్పించదు. అప్పుడే కొంతమంది వాళ్లకి ఎదురవుతారు. వాళ్ళే అసలైన నిజమైన జనాభా లెక్కల ఎంక్వయిరీకి వచ్చిన వాళ్ళు.. దాంతో వేదవతి వాళ్ళని చూసి ఏంటి మీరు దొంగతనాలు చేస్తున్నారా అని అడుగుతారు. దాంతో వేదవతి వాళ్ళు అందరూ అక్కడ నుండి పారిపోతారు. ఆ తర్వాత శోభని కిడ్నాప్ చేసిన వారిలో ఒకడు వాళ్ళకి కన్పిస్తాడు.. వాటిని పట్టుకొని శోభ అడ్రెస్ చెప్పమని నలుగురు కొడుతారు.

వాడు వీళ్ళ టార్చర్ భరించలేక శోభని కిడ్నాప్ చేసిన దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత శోభని ఇంకా కిడ్నాప్ చేసిన వాళ్లని వేదవతి వాళ్ళు స్టేషన్ కి తీసుకొని వస్తారు. శోభ జరిగింది అంతా ఇన్‌స్పెక్టర్ కి చెప్తుంది. దాంతో ధీరజ్ ని వదిలిపెడతారు. నేను చెప్పాను కదా.. నా కొడుకు ఎలాంటి తప్పు చెయ్యడని అని శోభ వాళ్ళ నాన్నతో రామరాజు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.