English | Telugu
Karthika Deepam2 : ఇంటికి తిరిగొచ్చిన సుమిత్ర.. షాక్ లో జ్యోత్స్న!
Updated : Nov 1, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -503 లో.....సుమిత్ర కన్పించడం లేదని జ్యోత్స్న కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దీపని అరెస్ట్ చేస్తారు. దీపతో కాంచన కూడా స్టేషన్ కి వస్తుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి జ్యోత్స్నపై కోప్పడతాడు. మా మమ్మీని ఈ దీప కిడ్నాప్ చేసిందని జ్యోత్స్న అంటుంది. అందుకు ఆధారాలు ఉన్నాయా అని శివన్నారాయణ అడుగుతాడు. తనే చేసిందని జ్యోత్స్న అంటుంది. ఇన్‌స్పెక్టర్ మీ దగ్గర ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారని ఇన్‌స్పెక్టర్ ని శివన్నారాయణ అడుగుతాడు..
గతంలో దీప కి మీకు పడదు కదా అని ఇన్‌స్పెక్టర్ అనగానే అది గతం ఇప్పుడు కాదు.. నా కోడలు నా కొడుకు దగ్గర క్షేమంగా ఉంది.. వాళ్ళని వదలేయ్ నా కూతురికి సారీ చెప్పమని ఇన్‌స్పెక్టర్ తో శివన్నారాయణ అనగానే కాంచన కి ఇన్‌స్పెక్టర్ సారీ చెప్తాడు. అప్పుడే కాంచనకి శ్రీధర్ ఫోన్ చేస్తాడు. జరిగింది మొత్తం కాంచన చెప్తుంది. ఫోన్ పారిజాతం తీసుకొని అల్లుడు అందరం ఇంటికి వెళ్తున్నాం.. తర్వాత చేస్తామని పారిజాతం ఫోన్ కట్ చేస్తుంది. నా భార్యని అరెస్ట్ చెయ్యడమేంటి జ్యోత్స్న.. నీ సంగతి చెప్తానని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు ఇంటికి వచ్చి మా మమ్మీ ఉందని బావ నీతో అబద్దం చెప్పి స్టేషన్ కి పంపించాడు తాత అని జ్యోత్స్న అంటుంటే.. తనపై శివన్నారాయణ కోప్పడతాడు. అప్పుడే శ్రీధర్ కూడా వచ్చి జ్యోత్స్నని తిడుతాడు.
అందరు నన్ను అంటున్నారేంటి ఖచ్చితంగా మమ్మీని దీపనే కిడ్నాప్ చేసిందని జ్యోత్స్న అంటుంది అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. దీప వెళ్లి ఎర్రనీళ్లు తీసుకొనిరా అని అంటాడు. వెనకాల గుమ్మం దగ్గర దశరత్, సుమిత్ర ఉంటారు. వాళ్ళని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. దీప దిష్టి తీస్తుంది.. అత్త నువ్వు ఈ గడప ఒక్కదానివి ఎప్పుడు దాటకూడదని ఎమోషనల్ డైలాగ్ చెప్తాడు. కాసేపటికి సుమిత్ర, దశరథ్ ఇద్దరు ఇంట్లోకి వస్తారు. నన్ను క్షమించండి మావయ్య అని శివన్నారాయణతో సుమిత్ర చెప్తుంది. దాంతో జ్యోత్స్న కోపంగా పైకి వెళ్తుంది. తన వెనకాలే పారిజాతం వెళ్తుంది. మీ అమ్మ వచ్చిందే కనీసం దగ్గరికి అయినా వెళ్ళు అంటుంది. నా మొహం కూడా చూడట్లేదు.. బావ ఎక్కువ అయిపోయాడని జ్యోత్స్న కోపంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.