English | Telugu
Jayam serial : రుద్రని సెటిల్ చెయ్యాలని చెప్పిన ఇషిక.. ఆ స్వామి చెప్పింది జరుగుతుందా!
Updated : Nov 1, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -99 లో.. ఇషిక, వీరు ఇద్దరు కలిసి ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చి తాము చెప్పినట్లు యాక్టింగ్ చెయ్యమని చెప్తారు. అందుకు అతను ఒప్పుకుంటాడు. ఆ తర్వాత పెద్దసారు చాలా హ్యాపీగా ఉంటాడు. రుద్ర అకాడమీ సక్సెస్ ఫుల్ గా అడ్మిషన్స్ తో నిండి పోయిందని ఇంట్లో వాళ్ళకి చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఇషిక ఎంట్రీ ఇస్తుంది. రుద్ర బావ గారిని ఇక జీవితంలో కూడా సెటిల్ చెయ్యాలంటే పెళ్లి చెయ్యాలని ఇషిక ఆంటుంది.
అప్పుడే ఇషిక, వీరు మాట్లాడిన మనిషి స్వామి వేషంలో ఇంటి ముందుకి వస్తాడు. కుటుంబం సమస్యల్లో పడబోతుందని చెప్తాడు. ఇలా ఎన్నో చెప్తారు డబ్బు కోసమని వీరు డబ్బు ఇవ్వబోతుంటే.. నీ డబ్బు ఎవరికి కావాలి.. నేను మీ కుటుంబం గురించి చెప్తున్నానని స్వామి అంటాడు. వద్దని వీరు అంటాడు. అప్పుడే శకుంతల ఎంట్రీ ఇచ్చి.. స్వామి ఏదో చెప్తున్నాడు కదా చెప్పనివ్వు అంటుంది. దాంతో స్వామిని లోపలికి పిలుస్తారు. ఈ కుటుంబంలోకి వచ్చిన కోడళ్ళు గొప్పింటి నుండి వచ్చారు కానీ ఇప్పుడు రాబోయే కోడలు పేద కుటుంబం నుండి వస్తుంది. తన వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని స్వామి చెప్తాడు. ఆ రుద్రుడి కోపాన్ని శాంతింపచేసి తనపై ఉండేదని స్వామి అంటాడు. శివుడి తలపై ఉండేది గంగ అని ఇషిక అనగానే అందరూ షాక్ అవుతారు. గంగ ఈ ఇంటికి కోడలా అని ఇందుమతి ఆశ్చర్యంగా చూస్తుంది.
మరొకవైపు గంగ కోసం రుద్ర పట్టిలు తీసుకొని వెళ్తాడు. నువ్వు చేసిన హెల్ప్ కి డబ్బు తీసుకోలేదు కనీసం గిఫ్ట్ అయినా తీసుకోమని పట్టిలు ఇస్తాడు రుద్ర. గంగ అవి తీసుకొని పెట్టుకోబోతుంటే తనకి పెట్టుకోవడం రాదు.. దాంతో రుద్రనే గంగ కాలికి పెడతాడు. మరొకవైపు శకుంతల స్వామి చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. పెద్దసారు వస్తాడు. అసలు ఆ గంగని ఇంటికి తీసుకొని వచ్చి పెద్ద తప్పు చేసానని పెద్దసారుతో శకుంతల అంటుంది. తరువాయి భాగంలో గంగని పారు కిడ్నాప్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.