English | Telugu

పవన్ కళ్యాణ్ పెద్ద పులిహోర రాజ!

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. ఇక ఫైనల్స్ కి డాలస్ డైనమైట్ స్నిగ్ద, లేడీ రాక్ స్టార్ బృంద, పవన్ కళ్యాణ్, కూర్మ సహస్ర, ధీరజ్ సెలెక్ట్ అయ్యారు. ఇక ఈ ఫినాలే ఎపిసోడ్ కి మాస్ మహారాజని ఇన్వైట్ చేశారు. ఐతే శనివారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. మద్యమద్యలో రవితేజ వేసే జోకులతో అందరిలో ఎనర్జీ వచ్చింది. ఐతే రవితేజ ఈ కంటెస్టెంట్స్ కోసం ఒక స్పెషల్ సెగ్మెంట్ ని ప్లాన్ చేశారు. అదేంటంటే డైమండ్ లాంటి పెర్ఫార్మెన్సెస్ ని గుర్తించి అవార్డ్స్ అందించారు. అవే "ఆహా పెర్ఫార్మెన్స్ అవార్డ్స్" అన్నమాట. ఇక రవితేజ స్టేజి మీదకు వెళ్లి కంటెస్టెంట్స్ కి ఈ అవార్డ్స్ ని అందించారు. ముందుగా బెస్ట్ స్పీకర్ అవార్డు ఇవ్వబోతున్నాం అని ఒక మైక్ తీసుకుని కూర్మ సహస్రని ఇన్వైట్ చేశారు. "బేసిక్ ఈ అవార్డుని సహస్రకి ఎందుకు ఇస్తున్నామంటే ఆవిడ చాలా అనుకుంటారు కానీ అవన్నీ లోపలే ఫినిష్ ఐపొతాయి బయటకు రావు" అని చెప్పాడు హోస్ట్ శ్రీరామ్. ఐతే రేస్ గుర్రంలో శృతి హాసన్ క్యారక్టర్ అనుకుంటా అని రవితేజ కామెడీ చేశారు.

"బెస్ట్ బొమ్మ అవార్డు" అని చెప్పగానే స్నిగ్ధ అని పిలిచారు రవి తేజ. తర్వాత "బెస్ట్ బిస్కెట్ అవార్డు" డెఫినిట్ గా ధీరజ్ ఉంటాడు అంటూ రవితేజ గెస్ చేసి పిలిచి ఒక పెద్ద బిస్కెట్ ని అవార్డుగా ఇచ్చారు. "బెస్ట్ రాకెట్ అవార్డు" అని చెప్పి సృష్టిని పిలిచారు రవితేజ. బ్యాక్ టు బ్యాక్ ఫారెన్ నుంచి ఫినాలే వరకు వచ్చినందుకు సృష్టి చిల్లకు బెస్ట్ రాకెట్ అవార్డుని అందించారు. "బెస్ట్ రాక్ స్టార్ అవార్డు" అంటూ బృందాని పిలిచారు రవితేజ. ఒక రాయి మీద ఒక స్టార్ ని పెట్టి ఆ అవార్డుని అందించారు. తర్వాత "బెస్ట్ పులిహోర రాజ అవార్డు" నేను గెస్ చేస్తా అంటూ పవన్ కళ్యాణ్ ని స్టేజి మీదకు పిలిచి ఒక బాక్స్ లో పులిహోర పెట్టి అదే అవార్డుగా ఇచ్చి ఎవరెవరితో పులిహోర కలుపుతావో వాళ్లందరితో కలిసి తినండి అన్నారు. ఫైనల్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అవార్డుని హోస్ట్ శ్రీరామ్ కి ఇచ్చారు. తర్వాత తన పాటలతో, రీల్స్ తో జనాలని సోషల్ మీడియాలో అలరించింది అలాగే ఈ సీజన్ కి యాంకర్ గా వచ్చి ఇక్కడి ఆడియన్స్ ని కూడా బాగా అలరించింది కాబట్టి బెస్ట్ డెబ్యూటేన్ట్ గా సమీరా భరద్వాజ్ కి కూడా అవార్డుని అందించారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.