English | Telugu
డేంజర్ జోన్ లో ఆ నలుగురు.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే!
Updated : Nov 1, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం చాలా మార్పులు జరిగాయి. హౌస్ లోకి ఇప్పటివరకు ఎలిమినేషన్ అయి బయటకు వెళ్ళిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్లు చేయగా.. శ్రీజ, భరణి ఇద్దరు హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిద్దరి మధ్య టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్.
భరణి , శ్రీజ ఇద్దరిలో ఆడియన్స్ ఓటింగ్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే పర్మినెంట్ హౌస్ మేట్ అనే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఇందులో భరణికి ఎక్కువగా ఓటింగ్ రావడంతో తను పర్మినెంట్ హౌస్ మేట్ అయ్యాడు. శ్రీజ ఎలిమినేట్ అయ్యుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ కోసం పోటీ జరగగా.. అందులో దివ్యకు మెజారిటీ హౌస్ మేట్స్ సపోర్ట్ చేయడంతో తను హౌస్ కి కొత్త కెప్టెన్ అయింది. ఇక హౌస్ లో ఈ వారం తనూజ, రాము రాథోడ్, సంజన గల్రానీ, కళ్యాణ్ పడాల, రీతూ చౌదరి, డీమాన్ పవన్, గౌరవ్ నామినేషన్లో ఉన్నారు. ఇక వీరిలో ఈ వారం హౌస్ నుండి ఎలిమినేషన్ అయ్యేదెవరో ఓసారి చూసేద్దాం.
తనూజకి అత్యధిక ఓటింగ్ పడింది. ముప్పై ఒక్క శాతం ఓటింగ్ తో తనూజ టాప్ లో ఉండగా, పదిహేడు శాతం ఓటింగ్ తో కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక మూడో స్థానంలో రాము రాథోడ్, నాల్గవ స్థానంలో సంజన గల్రానీ ఉంది. ఇక చివరి నాలుగు స్థానాలలో అంటే డేంజర్ జోన్ లో ఉన్నారు.
డీమాన్ పవన్, రీతూ చౌదరి, దువ్వాడ మాధురి, గౌరవ్ గుప్తా లీస్ట్ లో ఉన్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే గౌరవ్, రీతూ చౌదరి ఇద్దరు ఎలిమినేషన్ అవుతారు. లేదంటే కంటెంట్ కావాలంటే రీతూని ఎలిమినేషన్ నుండి తప్పించి డీమాన్ పవన్ ని ఎలిమినేషన్ చేస్తారు. లేదంటే సింగిల్ ఎలిమినేషన్ గా గౌరవ్ ని చేసే అవకాశం ఉంది. అయితే దువ్వాడ మాధురికి కూడా ఓటింగ్ తక్కువే ఉంది కానీ తను కంటెంట్ ఇస్తుంది సో ఎలిమినేషన్ చేసే అవకాశాలు అయితే లేవు. ఎనిమిదో వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారో తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.