English | Telugu
Brahmamudi : రాహుల్, కావ్యల మాటలకి టెంప్ట్ అయిన కోయిలి.. రంజిత్ చూసేశాడుగా!
Updated : Nov 1, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -866 లో...... రంజిత్, కోయిలి మాట్లాడుకుంటారు. ఎలాగైనా ఆ ఇంటికి కోడలు అయి ఆస్తులన్నీ లాగేసుకుంటానని రంజిత్ తో కోయిలి అంటుంది. అప్పుడే రాహుల్ బ్యాగ్ తో ఎంట్రీ ఇస్తాడు. ఏంటి రాహుల్ ఈ టైమ్ లో వచ్చావ్.. చేతిలో ఈ బ్యాగ్ ఏంటని రాహుల్ ని కోయిలి అడుగుతుంది. నన్ను అక్కడ అర్ధం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు.. అందుకే అక్కడ నుండి వచ్చేసానని రాహుల్ అనగానే అలా ఎందుకు వచ్చావ్.. నీ కుటుంబం చూసే కదా నేను నిన్ను లవ్ చేసింది అని కోయిలి అనగానే రాహుల్ షాక్ అవుతాడు.
అంటే నాకు కుటుంబం లేదు.. మీలాంటి ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నా కోరిక అని రాహుల్ కవర్ చేస్తుంది. రాహుల్ కి అక్కడ ఉండబుద్ది కాలేదేమో వచ్చేసాడు.. పర్లేదులే నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో రాహుల్ అని రంజిత్ అనగానే రాహుల్ లోపలికి వెళ్తాడు. వీడెంటి ఇలా చేసాడని కోయిలి అంటుంది. మెల్లగా మ్యానిపులేట్ చేసి వాడిని నువ్వే పంపించు అని కోయిలితో రంజిత్ అంటాడు. మరొకవైపు అసలు ఇంతలా ఎవరు రాహుల్ ని మార్చేసింది.. ఎవరని ఇంట్లో వాళ్లంతా ఆలోచిస్తూ ఉంటారు. అది ఎవరో కనుక్కోమని అప్పుకి చెప్పానని కావ్య అంటుంది. అప్పుడే అప్పు, కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. అది ఎవరో కనుక్కున్నాను అక్క.. తన పేరు కోయిలి అని, తన గురించి అప్పు మొత్తం చెప్తుంది. దాంతో రాహుల్ కి, వాళ్ళకి ఎలా బుద్ది చెప్పాలో మాకు తెలుసు అని కావ్య, రాజ్ అంటారు.
మరొకవైపు రాహుల్ ని ఇంటికి వెళ్ళడానికి రంజిత్, కోయిలి కన్విన్స్ చేస్తారు. నేను ఇంటికి వెళ్లను.. నాకు ఎవరు లేరని రాహుల్ అంటాడు. అప్పుడే రాజ్, కావ్య ముసలి వాళ్ళ గెటప్ లో ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. నీకు ఎవరు లేకపోవడం ఏంట్రా.. భార్య ఇంకా ఇంటికి వద్దనుకొని వచ్చావని రాజ్ అంటాడు. నో డౌట్ వీళ్ళు కచ్చితంగా రాజ్, కావ్య అని రాహుల్ అనుకుంటాడు. మేమ్ ఇక్కడ నీతో పాటు ఉంటాం.. ఆస్తులన్నీ ఎవరు చూసుకుంటారు.. మీ చేతుల్లో పెట్టాలని అనుకుంటున్నామని కావ్య అంటుంది. దాంతో కోయిలి టెంప్ట్ అయి వాళ్ళతో మంచిగా మాట్లాడుతుంది. తరువాయి భాగంలో రాజ్, కావ్య రూమ్ లోకి వెళ్లి గెటప్ లు తీసేస్తారు. వాళ్ళని రంజిత్ చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.