English | Telugu

ఊపందుకున్న బిగ్ బాస్ టాస్క్.. ఇద్దరి మధ్య చిచ్చు!

బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం టాస్క్ ల జోరుగా సాగుతున్నాయి. నిన్న నబీల్, గౌతమ్ మధ్య జరిగిన టాస్క్ లో నబీల్ గెలిచాడు. కంటెండర్ షిప్ కోసం సాగుతున్న ఈ టాస్క్ లు ఫుల్ జోష్ లో సాగుతున్నాయి.

మొదటి టాస్క్ లో రోహిణి, రెండవ టాస్క్ లో నబీల్, మూడో టాస్క్ లో పృథ్వీ ఇలా ముగ్గురు సూట్ కేసు తీసుకున్న వాళ్ళే రేస్ లో పాల్గొన్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ రిలీజ్ చేసిన మొదటి ప్రోమో ఉత్కంఠగా ఉంది. మూడో టాస్క్ లో విష్ణుప్రియకి ఆడే ఛాన్స్ వచ్చింది. ఇక సూట్ కేసు తీసుకున్న ముగ్గిరిలో ఇద్దరిని ఆల్రెడీ సెలక్ట్ చేసుకొని టాస్క్ పూర్తి చేశారు. మిగిలింది పృథ్వీ కాబట్టి తను టాస్క్ ఆడేందుకు విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక పృథ్వీ, విష్ణుప్రియ మధ్య టాస్క్ జరుగుతున్నట్లుగా ప్రోమోలో తెలుస్తోంది.

అయితే ఈ సీజన్ మొదటి నుండి విష్ణుప్రియకి పృథ్వీ అంటే ఇష్టం. కానీ పృథ్వీ మాత్రం లైట్ తీసుకుంటు వస్తున్నాడు. ఇద్దరు ఇంత వరకు ఒకరినొకరు నామినేట్ చేసుకోలేదు. అయితే ఇప్పుడు కంటెండర్ షిప్ కోసం జరుగుతున్న టాస్క్ లో వీరిద్దరి మధ్య డిస్టబెన్స్ వచ్చేలా ఉంది. ఇద్దరికి మధ్య జరిగిన టాస్క్ ల.. సరైన 'కీ' తీసుకొని వెళ్లి తాళం ఓపెన్ చెయ్యాలి. ఈ గేమ్ లో పృథ్వీకి గట్టి పోటీ ఇచ్చింది విష్ణుప్రియ. కానీ పృథ్వీ మాత్రం వేరే 'కీ' తను ముందు పడేసి స్ట్రాటజీ ప్లే చేసి తను వొరిజినల్ 'కీ' తీసుకున్నాడు. అలా పృథ్వీ తాళం ఓపెన్ చేసినట్టుగా ప్రోమోలో తెలుస్తోంది.

ఆ తర్వాత విష్ణుప్రియకి గేమ్ లో ఏం జరిగిందనేది రోహిణి, టేస్టీ తేజ వివరిస్తున్నారు. నువ్వు గేమ్ ఆడుతునప్పుడు వేరే 'కీ' లోపలికి ఎందుకు తీసుకొని వస్తారు. ఆ ప్లేస్ లో పృథ్వీ కాకుండా ఎవరైనా ఉంటే ఈ విషయం అడిగేదానివి కదా అంటూ విష్ణుప్రియతో రోహిణి, టేస్టీ తేజతో అంటున్నారు. మరి ఈ గేమ్ తర్వాత అయిన పృథ్వీ నిజస్వరూపం తెలుసుకొని విష్ణుప్రియ గేమ్ లో ముందుకి వెళ్తుందో లేదో చూడాలి మరి!

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.