English | Telugu

రోహిణి ఎమోషనల్ ... మన పర్సనాలిటీకి ట్రోఫీలు రావులేరా

బిగ్ బాస్ సీజన్-8 లో కొందరు ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నారు. మరికొందరు టాస్క్ లు ఆడుతున్నారు. ఇంకొంతమంది స్ట్రాటజీలు ప్లే చేస్తూ నెట్టుకొస్తున్నారు. సీజన్ మొదట్లో ఎంటర్‌టైన్మెంట్ తగ్గిందంటూ ఓ సీజన్ పై నెగెటివిటి మొదలైంది. కానీ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన రోహిణి, అవినాష్, టేస్టీ తేజ వాళ్ళ ఎంట్రీతో బిగ్ బాస్ ఎంటర్‌టైన్మెంట్ కి కొదవ లేదనిపిస్తుంది. స్పాంటేనియస్ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నారు.

ఇక అవినాష్, రోహిణి ల కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు. అందుకే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బోరింగ్ ఉన్న ప్రతీసారి అవినాష్ రోహిణి లని ఏదో ఒక సాకు చెప్పి వారితో కామెడీ చేపిస్తూ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్నాడు. రోహిణి ఎంటర్‌టైన్మెంట్ విషయంలో తనని హౌస్ లో ఎవరు బీట్ చెయ్యలేరు. టాస్క్ లో కూడా బాగా ఆడుతుంది. తన కాలికి ఆపరేషన్ అయింది. అయిన కూడా గేమ్ బాగా ఆడుతుంది. టేస్టీ తేజ కూడా తనకి ఓపిక ఉన్నంత వరకు బాగా పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. రోహిణి, తేజ ఇద్దరు ఒకానొక సందర్భంలో లివింగ్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటారు. మన పర్సనాలిటీకి ట్రోఫీలు మనకి రావులేరా.. ఏదో ఉన్నన్ని రోజులు మన వంతు ఎంటర్‌టైన్మెంట్ చెయ్యాలంటూ టేస్టీ తేజతో రోహిణి అంటుంది. వారి మాటలు కామెడీగా ఉన్న మీనింగ్ బాధగా అనిపిస్తుంది.

ఆ వీడియో క్లిప్ కాస్త వైరల్ గా మారింది. హౌస్ లో ఎంటర్‌టైన్మెంట్ అంటే రోహిణిది. అలాగే లావుగా ఉన్న టేస్టీ తేజ కూడా వంద శాతం ఎఫర్ట్ పెడుతున్నాడు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఇలా నిజంగా ఉండేవాళ్లకి, ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేవారికి ఓట్ చెయ్యాలి అంతే కానీ ప్రతీగేమ్ లో ఫ్లిప్ అవుతు ఉండే వాళ్ళకి కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు తమ ఓట్లు మాత్రం వాళ్ళకే అంటూ తమ అభిమానం చాటుకుంటున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.