English | Telugu

పృథ్వీ, నబీల్ ల మధ్య మాటల యుద్ధం.. తనే కారణమా!

బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా పృథ్వీ, నబీల్ నీ సపోర్ట్ చేయమని అడుగగా.. చెయ్యనని అనగానే అంతకు ముందు వరకు ఉన్న ఫ్రెండ్స్ కాస్తా శత్రువులుగా మారిపోయారు. "మూట ముఖ్యం" టాస్క్ లో.. పృథ్వీ, ప్రేరణ, రోహిణి లు ఉండగా నబీల్, గౌతమ్, అవినాష్ లు రోహిణి కి సపోర్ట్ చేస్తున్నారు.

అందులో భాగంగా మూటలు పృథ్వీ దాంట్లో వేస్తున్నాడు నబీల్. అది భరించలేని పృథ్వీ.. నాపై వేస్తున్నావంటూ కోప్పడతాడు. నేను వెయ్యలేదని నబీల్ చెప్తుంటాడు‌. అయిన పృథ్వీ తన అగ్రెషన్ నీ బయటకు తీస్తాడు. ఆ తర్వాత పృథ్వీ కంటైనర్ లో ఎక్కువ మూటలు ఉండడంతో తను అవుట్ అఫ్ ది టాస్క్ అవుతాడు. గేమ్ పాజ్ లో ఉన్నప్పుడు నబీల్ కంటైనర్ జరిపాడటా అదే విషయం నబీల్ నీ పృథ్వీ అడిగి గొడవకి దిగుతాడు. ఇద్దరు గట్టిగా అరుస్తు.. మీది మీదికి పోతుంటారు. నిఖిల్ అవినాష్ లు ఆపే ప్రయత్నం చేసిన కూడా ఆగరు.

అయితే టాస్క్ ముందు వరకు మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్న వీరిద్దరు టాస్క్ తర్వాత ఒకరినొకరు ద్వేషించుకున్నారు‌. పృథ్వీకి నబీల్ సపోర్ట్ చెయ్యలేరని మనసులో పెట్టుకొని కావాలని ఇదంతా చేసాడని స్పష్టంగా అనిపిస్తుంది. నబీల్, పృథ్వీల మధ్యలో అవినాష్ వెళ్లి.. ఆపుతుంటే నువ్వు అగు అంటూ అవినాష్ ని పక్కకి నెట్టుతాడు నబీల్. అదే విధంగా నిఖిల్ నీ కూడా ఇన్వాల్వ్ అవ్వకని చెప్తాడు. ఆ గొడవ తర్వాత.. ఆ హీట్ అఫ్ ది మూమెంట్ లో అలా అన్నానని నిఖిల్ కి సారీ చెప్తాడు‌ నబీల్.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.