English | Telugu

హరితేజ కన్నింగ్ బయటపడిందిగా.. నబీల్ గురించి బ్యాడ్ గా చెప్తూ దొరికేసింది!


బిగ్ బాస్ సీజన్-8 పదో వారం క్రేజీగా సాగుతోంది. హౌస్ లో మెగాచీఫ్ కోసం గత వారం నుండి హౌస్ లో టాస్క్ లు జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో .. నబీల్ దగ్గరికి పృథ్వీ వచ్చి సపోర్ట్ చెయ్యమని అడుగగా.. చెయ్యలేనని, వేరే వాళ్ళకి మాట ఇచ్చానని నబీల్ అంటాడు. ఆ తర్వాత గౌతమ్, నబీల్, అవినాష్ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. నాగు పాము బుస కొట్టినట్లు కొడుతాడని హరితేజ అంటుంది. ఇక నుండి అలాగే చేస్తానని నబీల్ అంటాడు.

ఇక హరితేజ కంప్లీట్ గా నబీల్ గురించి కన్నడ బ్యాచ్ కి నెగెటివ్ గా చెప్పి నబీల్ నీ దూరం చేసి మెల్లగా ఆ బ్యాచ్ లోకి దూరుతుంది. టాస్క్ లో పృథ్వీ, నబీల్ లు గొడవ పడతారు. ఆ తర్వాత పృథ్వీ దగ్గరికి హరితేజ వెళ్లి.. మీరు గొడవపడుతుంటే అవినాష్ ఆపుతున్నాడు కదా.. తేజ వెనకాల నుండి ఆపకు కానివ్వు అంటున్నాడని హరితేజ అంటుంది. అంటే నిన్ను ఇంకా రెచ్చాగొట్టలని అని ట్రై చేస్తున్నారు.. నువ్వు అగ్రిసివ్ అవ్వకుండా ఉండమని పృథ్వీకి చెప్పింది హరితేజ. ఆ తర్వాత ఏవిక్షన్ షీల్డ్ టాస్క్ లో స్నేక్ పిలిచిన వెంటనే. . ఇద్దరు వెళ్లి ఏవిక్షన్ షీల్డ్ అవసరం లేని ఒకరిని తగిన కారణాలు చెప్పి తీసేయ్యాలని చెప్పగా రోహిణి, హరితేజలని బిగ్ బాస్ పిలుస్తాడు. రోహిణి ఆలోచించి నిఖిల్ పేరు చెప్తుంది. ఎందుకు అంటే తనకి ఒకవేళ షీల్డ్ వచ్చిన నాకు యూజ్ చేసుకోను అన్నాడు కదా.. అతనికి వద్దని అంటుంది రోహిణి. హరితేజ మాత్రం అవినాష్ , నబీల్ అంటుంది. ఇలా ఇద్దరి మధ్య చాలాసేపు డిస్కషన్ సాగుతుంది. స్నేక్ సీరియస్ అవడంతో రోహిణి అవినాష్ గుడ్డు స్నేక్ నోట్లో వేస్తుంది కానీ షీల్డ్ అవసరం లేదని చెప్పిన నిఖిల్ ని తీసేయ్యడానికి మాత్రం హరితేజ ఒప్పుకోలేదు.

ఆ తర్వాత అదే విషయం యష్మీ నిఖిల్ కి చెప్తుంది హరితేజ. నిఖిల్ కి సపోర్ట్ చేసినందుకు నిఖిల్ హగ్ చేసుకొని థాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత అందరికి సంబంధించిన ఎగ్స్ స్నేక్ నోట్లో కి వెళ్తాయి‌‌. ఒక నబీల్ కి సంబంధించినది ఉంటుంది. దాంతో తేజ కంగ్రాట్స్ నబీల్ అని అంటుంటే.. తను ఏమైనా అడి గెలిచాడా అంటూ హరితేజ వెటకారంగా మాట్లాడుతుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.