English | Telugu

కొత్త మెగా చీఫ్ గా ప్రేరణ.. బిగ్ బాస్ రూల్స్ ని పట్టించుకోని విష్ణుప్రియ!

బిగ్ బాస్ హౌస్ లో లేడీస్ లలో ఫైటర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రేరణ అని అనడంలో ఆశ్చర్యమే లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి గెలవాలనే ఒక ఇంటెన్షన్ తో వచ్చిందని క్లియర్ గా అర్ధమవుతుంది. ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ టాస్క్ లు ఆడాలి.. గెలవాలనే కసితో ఉంటుంది. ఇప్పటివరకు మెగా చీఫ్ దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. ఇక ఈ వారం తన టర్న్ రానే వచ్చింది.

మెగా చీఫ్ టాస్క్ లో చివరగా రోహిణి ప్రేరణ ఉండగా ఎక్కువ మంది ప్రేరణకి సపోర్ట్ చేశారు. దాంతో మెగా చీఫ్ అయింది. అదే విషయం బిగ్ బాస్ అనౌన్స్ చేసాక అవినాష్ తన మెగా చీఫ్ బ్యాండ్ ని ప్రేరణకి ఇస్తాడు. ప్రేరణ చాలా ఫ్రౌడ్ గా ఫీల్ అవుతూ.. ముందుగా రోహిణికి థాంక్స్ చెప్తుంది. ఎందుకు అంటే ఆరెంజ్ కలర్ సూట్ కేసు ప్రేరణకి ఇచ్చి కంటెండర్ ని చేసింది కాబట్టి.... ప్రేరణ మెగా చీఫ్ అయిందో లేదో అప్పుడే రూల్స్ రెగ్యులేషన్ అంటూ మొదలెట్టింది. ఒక్క రోజుకే విష్ణుప్రియకి నెగటివ్ అయింది ఈ బ్యూటీ. తన ఆక్సెసిరిస్(వస్తువులు) అన్ని కూడా లోపల పెట్టుకోవాలని తన బెడ్ దగ్గరికి వెళ్లి అన్నీ నీట్ గా ప్రేరణ పెడుతుంటుంది. అవి నేను డైలీ యూజ్ చేసేటివి అక్కడే ఉంచు.. ఏదైనా బిగ్ బాస్ చెప్తే నేను సమాధానం చెప్తానమంటూ కోపంగా మాట్లాడుతుంది విష్ణుప్రియ.

ఆ తర్వాత అనవసరంగా ప్రేరణకి సపోర్ట్ చేసాను. నన్నే ఎఫెక్ట్ చేస్తుంది. ఇక నేనేం పని చెయ్యను.. అన్ని ఎక్కడివి అక్కడే పారేస్తానంటూ మళ్ళీ వెళ్లి బట్టలు వస్తువులు చిందర వందర చేసింది విష్ణుప్రియ. చూస్తున్నారా అదంతా కావాలనే చేస్తుందని నబీల్, అవినాష్ వాళ్ళతో అంటుంది ప్రేరణ. నేను ఏ రోజు పని ఆ రోజు చెయ్యమని చెప్పాను అంతే అని ప్రేరణ అంటుంది. తను చేసేది రాంగ్.. మెగా చీఫ్ నీ డీస్ రెస్పెక్ట్ ఫుల్ గా చూస్తుందని ప్రేరణ అంటుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.