English | Telugu

నిన్న‌టి వ‌ర‌కు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్ప‌డు పెళ్లాం?

బిగ్‌బాస్ లో ష‌న్ను, సిరిల అరాచ‌కం ప‌రాకాష్ట‌కు చేరింది. మ‌రో రెండు రోజుల్లో సీజ‌న్ ఎండ్ అవుతున్న నేప‌థ్యంలో హౌస్ లో వీరి చేష్ట‌లు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. ఎంత‌లా అంటే చూసే ఆడియ‌న్స్ కి వెగ‌టు పుట్టించేలా. గ‌త కొన్ని వ‌రాలుగా పేరెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి వీళ్ల అతి చేష్ట‌ల‌కు చివాట్లు పెట్టినా `న‌వ్విపోదురుగాక మాకేటి సిగ్గు` అన్న‌ట్టుగా ష‌న్ను, సిరి వ్య‌వంహ‌రిస్తూ హౌస్ లో గ‌బ్బు లేపుతున్నారు. పేరెంట్స్ హ‌గ్గులు మితిమీరు తున్నాయ‌ని, అది మాకు న‌చ్చ‌డం లేద‌న్నా.. ఆంటీ ఇది ఫ్రెండ్షిప్ హ‌గ్ మాత్ర‌మే అంటూ నిస్సిగ్గుగా సిరిని హ‌గ్ చేసుకుంటూనే వున్నాడు ష‌న్ను.

Also Read:మీకు న‌చ్చిన‌ట్లు కాకుండా వాడికి న‌చ్చిన‌ట్లు ఉండ‌నివ్వండి.. దీప్తి ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

గురువారం వీరి ఎపిసోడ్ మ‌రీ ప‌రాకాష్ట‌కు చేరింది. గురువారం ఎపిసోడ్ `గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా..` అనే హుషారైన సాంగ్ తో మొద‌లైంది. ఆ వెంట‌నే సిరి - ష‌ణ్ముఖ్ లు త‌మ రెగ్యుల‌ర్ ప‌నికి తెర‌లేపారు. సోఫాలో సిరి - ష‌ణ్ముఖ్ లు కూర్చుని ఉండ‌గా ష‌ణ్ముఖ్ బిగ్ బాస్‌ని ఇమిటేట్ చేస్తూ సిరిని ఉద్దేశించి `బిగ్‌బాస్ కోరిక మేర‌కు సిరి పెళ్లాం ఇచ్చిన‌ట్టు అడ‌క్కుండానే కాఫీ ఇవ్వ‌కండి` అని అన్నాడు. పెళ్లాం అన‌గానే సిరి సిగ్గుల మొగ్గైంది. ముసి ముసి న‌వ్వులు న‌వ్వుకుంటూ `ఏంటి సార్ మీకు అలా అనిపిస్తుందా? ప‌ఒద్దు పొద్దున్నే ఏమైంది మీకు` అని అడిగింది.

ఈ దృశ్యం.. ఈ మాట‌లు చూసి బిగ్‌బాస్ వీక్ష‌కుల ఫీజులు అవుట్‌.. మ‌రీ ఇంత ప‌రాకాష్ట‌కు చేరుకోవ‌డం ఏంటి సామీ.. నాగార్జున సార్ చూస్తున్నారా? .. ఈ మాట‌లు వింటున్నారా? .. ఏంటీ అరాచ‌కం?.. ఏంటీ మా క‌ర్మ‌.. అంటూ నెటిజ‌న్స్ నెట్టింట వీరంగం మొద‌లుపెట్టారు. బిగ్‌బాస్ ఎండింగ్ కి చేరుకున్నా వీరి అరాచ‌కాల‌కి మాత్రం తెర‌ప‌డ‌టం లేదంటూ ఓ రేంజ్ లో సిరిని, ష‌న్నుని ఏకిపారేస్తున్నారు. మ‌రి దీనిపై శ‌నివారం నాగార్జున కౌంట‌ర్ ఇస్తారా? లేక ఇంకా ముందుకు వెళ్లుంటే బాగుండేది.. వైఫ్ అండ్ హజ్బెండ్ టాస్క్ ఇస్తాలే ఎంజాయ్ చేయిండి అని ఎంక‌రేజ్ చేస్తాడా? అని నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు.