English | Telugu
ఆలోచనలో పడ్డ రిషి, వసు.. ఏం జరుగుతోంది?
Updated : Nov 19, 2021
బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఫ్యామిలీ డ్రామా `గుప్పెడంత మనసు`. వసుధార, రిషి జంట నేపథ్యంలో ఆసక్తికర మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ రోజు రోజుకీ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ రోజు ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగేలా కనిపిస్తోంది. గత కొన్ని ఎపిసోడ్‌లుగా తన ప్రేమని వసుధారతో చెప్పడానికి ఇబ్బందులు పడిన రిషి మొత్తానికి తన మనసులో మాటని బయటపెట్టేసిన విషయం తెలిసిందే.
తాజాగా శుక్రవారం ఎపిసోడ్ మరింత ఆసక్తిగా సాగబోతోంది. రిషి తన గదిలో ఒంటరిగా కూర్చొని వసుధార అన్న మాటలని గుర్తుచేసుకుంటూ వుంటాడు. ఇదే సమయంలో రిషి రూములోకి వచ్చిన తండ్రి మహేంద్ర రిషి మనసులో ఏముంది? .. వసుధార గురించి తను ఏమనుకుంటున్నాడని ఆరాతీసే ప్రయత్నం చేస్తాడు. కానీ రిషి మాత్రం ఎక్కడా బయటపకుండా జాగ్రత్తపడతాడు.
ఇదే కర్మంలో వసుధార ఆరోగ్యం గురించి తెలుసుకోమని జగతికి ఫోన్ చేయమంటాడు రిషి దాంతో మహేంద్ర .. జగతికి ఫోన్ చేసి వసుధార ఆరోగ్యం గురించి తెలుసుకుంటాడు. కట్ చేస్తే క్యాలేజ్ క్యాబిన్‌లో జగతి, మహేంద్ర కూర్చుని రిషి, వసుధారల గురించి మాట్లాడుకుంటుంటారు. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? రిషి .. జగతి, మహేంద్రలని ఏమడిగాడు.. ఆ తరువాత ఏం జరిగింది అన్నది ఈ రోజు ఎపిసోడ్‌లో చూడాల్సిందే.