English | Telugu

అషురెడ్డి దుబాయ్ బ్యాగ్ క‌హానీ విన్నారా?

బిగ్‌బాస్ తో లైమ్ లైట్‌లోకి వ‌చ్చేసిన యూట్యూబ‌ర్ అషురెడ్డి ప్ర‌స్తుతం స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న `కామెడీ స్టార్స్‌`లో హ‌రి టీమ్‌తో క‌లిసి స్కిట్‌లు చేస్తూ ఆక‌ట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. గ‌త రెండు వారాలుగా ఈ షోలో క‌నిపించ‌కుండాపోయిన అషురెడ్డి తాజాగా దుబాయ్ విహారానికి వెళ్లింది. అక్క‌డ ఎంజాయ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్‌లో జ‌ల‌కాలాడుతూ నెటిజ‌న్‌ల‌కు క‌నువిందు చేసింది.

చేయాల్సినంత ఎంజాయ్ చేసిన అషు రెడ్డి ప్ర‌త్యేకంగా దుబాయ్‌లో త‌న‌కు కావాల్సి వ‌న్నీ కొనుక్కోవ‌డానికి షాపింగ్ చేసింది. ఈ షాపింగ్‌లో భాగంగా రెండు హ్యాండ్ బ్యాగ్‌లు తీసుకుంది. అయితే అవి మామూలు హ్యాండ్ బ్యాగ్‌లు కాదు. ఒక్కో హ్యాండ్ బ్యాగ్ ఖ‌రీదు అక్ష‌రాలా ఎండున్న‌ర ల‌క్ష‌లు. ఈ విష‌యం తెలిసి అషురెడ్డి త‌ల్లి షాక్ గుర‌వ‌డ‌మే కాకుండా డ‌బ్బుల‌న్నీ దుబారా చేస్తోంద‌ని, అషుకు డ‌బ్బు విలువ తెలియ‌డం లేద‌ని ఆగ్రంతో ఊగిపోయి దుడ్డు తిరిగేసేంత ప‌ని చేసింది.

సోష‌ల్ మీడియాలో గ‌త కొంత కాలంగా ర‌చ్చ చేస్తున్న అషురెడ్డి ఈ మ‌ధ్య కాస్త త‌న ఫోక‌స్‌ని యూట్యూబ్‌కు మార్చింది. త‌న సొంత ఛాన‌ల్‌ని మ‌రింత‌గా పాపుల‌ర్ చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ప‌డిన అషు అందుకోసం ఇంటికి సంబంధించిన వీడియోల‌ని కూడా పోస్ట్ చేయ‌డం మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలో త‌న త‌ల్లికి , త‌న‌కు మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర విష‌యాల‌కు సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేసింది. ఇందులో అషు త‌ల్లి పాత బ్యాగ్‌ల‌ని కాల్చి వేయ‌డం.. మ‌రోసారి స‌ర‌దాల పేరుతో డ‌బ్బు త‌గ‌లేస్తే ఊరుకోన‌ని వార్నింగ్ ఇవ్వ‌డం ఆస‌క్తిగా మారింది.