English | Telugu
అవినాష్ ముక్కు పగలగొట్టిన యాదమ్మ రాజు
Updated : Nov 20, 2021
స్టార్ మాలో హాస్య ప్రియుల్ని ఎంటర్‌టైన్ చేస్తున్న షో కామెడీ స్టార్స్. మల్లెమాల ఎంటర్ టైన్‌మెంట్స్ అందిస్తున్న `జబర్దస్త్` షోకు పోటీగా `స్టార్ మా`లో ఓంకార్ స్టార్ట్ చేసిన ఈ షో గత కొన్ని నెలలుగా బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ మంచి రేటింగ్‌తో కొనసాగుతోంది. ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 1: 30 గంటలకు ప్రసారం అయ్యే ఈ షో కు సంబంధంచిన తాజా ప్రోమోని విడుదల చేశారు.
ఈ ఆదివారం ప్రసారమయ్యే షోలో హరి, యాదమ్మ రాజు, ముక్కు అవినాష్, యాదమ్మ రాజులు కలిసి చేసే కామెడీ హైలైట్‌గా నిలవబోతోంది. హరితో కలిసి యాదమ్మ రాజు లేడీ గెటప్‌లో నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే `నా బిల్డప్ అంతా చూసి వచ్చింది అషురెడ్డి అనుకున్నార్రా ` అన్నాడు హరి. దానికి యాదమ్మ రాజు `నా గ్లామర్ ఎక్కడ అషు గ్లామర్ ఎక్కడ` అన్నాడు. నిజమే నీకు, అషుకు ఆటోకీ ఆడీ కార్‌కి వున్న తేడా వుందని హరి అనడం.. ఓ అషుని ఆటోతో పోల్చావా అని యాదమ్మ రాజు అనడం నవ్వులు పూయిస్తోంది.
ఇక ముక్కు అవినాష్‌తో కలిసి యాదమ్మ రాజు చేసిన స్కిట్ కూడా ఓ రేంజ్‌లో పేలనున్నట్టుగా తెలుస్తోంది. ముక్కు అవినాష్ ముక్కు గుర్తుతో పోటీకి దిగడం.. అతని అనుచరుడిగా యాదమ్మ రాజు గుద్దాలే గుద్దాలే ముక్కునే గుద్దాలే అంటూ ప్రచారం చేస్తూ ముక్కు అవినాష్ ముక్కు పగలగొట్టడం హిలేరియస్‌గా వుంది. కడుపుబ్బా నవ్వించే ఈ కామెడీ స్కిట్ లు వచ్చే ఆదివారం బుల్లితెర ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేయనున్నాయి.