English | Telugu

Brahmamudi : కళ్యాణ్ గురించి అనామిక... దుగ్గిరాల కుటుంబం చూడనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -559 లో....ఎందుకు కళ్యాణ్ పై డాక్యుమెంటరీ తీస్తున్నావని అనామికని సామంత్ అడుగుతాడు. దుగ్గిరాల వారసుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దాంతో ఇంట్లో వాళ్ళు గేంటెస్తే ఆటో నడిపి జీవనం కొనసాగిస్తున్నాడంటూ టీవీలో వచ్చేలా చేస్తే అప్పుడు వాళ్ళ పరువు పోతుందని అనామిక అంటుంది. నువ్వు వాళ్ళ కంపెనీకి నష్టం చేస్తాను అన్నావని సామంత్ అంటాడు. మనం ఒక సామ్రాజ్యo కావాలి అనుకుంటున్నాం.. అందుకు ఒక యుద్ధమే చెయ్యాలని అనామిక అంటుంది. అందులో నేను చావకుండా ఉంటే చాలని సామంత్ అనుకుంటాడు.

ఆ తర్వాత ఇందిరాదేవి సీతారామయ్య దగ్గరికి వచ్చి.. వద్దని అనుకొని వెళ్లిన క్లయింట్స్ అందరిని కావ్య మళ్ళీ వచ్చేలా చేసి అగ్రిమెంట్ పెట్టుకుందని చెప్తుంది. ఈసారి ఎప్పటిలాగే దీపావళికి ఎంప్లాయిస్ కి బోనస్ ఇవ్వాలి కదా.. ఇప్పుడు మనం కావ్య చేత ఇప్పిద్దామని ఇందిరాదేవి అనగానే మంచి ఆలోచన అని సీతారామయ్య అంటాడు.‌ఆ తర్వాత ఇద్దరు హాల్లోకి వెళ్లి అందరికి ఈ విషయం చెప్తారు. అందరు ఆలోచన బాగుందని అంటారు. ఒక రుద్రాణి, ధాన్యలక్ష్మి తప్ప నా కొడుకు గురించి ఎవరు పట్టించుకోవడం లేదని ధాన్యలక్ష్మి అనగానే.. ఎందుకు పట్టించుకోవడం లేదు తీసుకొని వచ్చాం.. నువ్వే అవమానించి పంపించావ్.. ఇప్పుడు తీసుకొని వచ్చే బాధ్యత నీదే అని ఇందిరాదేవి అనగానే ప్రకాశ్ ధాన్యలక్ష్మిని తీసుకొని అప్పు, కళ్యాణ్ ల దగ్గరికి వెళ్తాడు.

ఆ తర్వాత కావ్యని ఒప్పించడానికి ఇందిరాదేవి వెళ్తుంది. కావ్య ఇందిరాదేవిని చూసి ప్రేమగా దగ్గరికి వస్తుంది. దీపావళికి ఇంటికి రావాలి.. బోనస్ నీ చేతుల మీదగా ఇవ్వాలనుకుంటున్నామని ఇందిరాదేవి అనగానే.. రానని కావ్య అంటుంది. ఆ తర్వాత కనకం, ఇందిరాదేవిలు కావ్య ని ఒప్పిస్తారు. మరొకవైపు ధన్యలక్ష్మి ప్రకాష్ లు అప్పు, కళ్యాణ్ ల దగ్గరికి వెళ్తారు. పండగికి రా కళ్యాణ్ అని ధాన్యలక్ష్మి అనగానే అప్పుని పిలవలేదని కళ్యాణ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్య రావడం చూసిన రాజ్.. నువ్వెందుకు వచ్చవన్నట్లు మాట్లాడతాడు. ఆ తర్వాత నేను కళ్యాణ్ డాక్యుమెంటరీని న్యూస్ లో వచ్చేలా చేసాను. అది ఇంట్లో వాళ్ళు చూసేలా చెయ్ అని రుద్రాణికి అనామిక ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.