English | Telugu

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి కొత్త ప్లాన్.. కోడలికి అగ్నిపరీక్ష కానుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -245 లో... అభికి రామలక్ష్మి వార్నింగ్ ఇవ్వాలని వెళ్తుంది కానీ అభి మాత్రం తన ప్లాన్ ప్రకారం తనని ఫాలో అవుతూ వస్తుందని గెస్ చేస్తాడు. అలాగే రామలక్ష్మి వస్తుంది. ఇక అభి ఇంటిదగ్గరే డిటేక్టివ్ అభి కోసం వెయిట్ చేస్తుంటే అభి వస్తాడు.‌తన వెనకాలే రామలక్ష్మి వస్తుంది. ఎందుకు మళ్ళీ వచ్చావ్ కావాలని ఇదంతా చేస్తున్నావంటూ రామలక్ష్మి అభితో గొడవపడుతుంది కానీ దూరం నుండి వాళ్లు మాట్లాడుకోవడం డిటేక్టీవ్ చూస్తాడు.

ఆ విషయం సీతాకాంత్ కి ఫోన్ చేసి చెప్పాలని ఫోన్ చేస్తాడు. ఏదో చెప్తూ డిటేక్టివ్ ఫోన్ కట్ చేస్తాడు. అది సీతాకాంత్ కి ఏం అర్ధం కాదు. అప్పుడే రామలక్ష్మికి మత్తు ఇవ్వాలని అభి అనుకొని తనని పట్టుకుంటాడు. ఇదంత అభిగాడు కావాలని చేస్తున్నాడేమో మేడమ్ ని కాపాడాలనుకోని అభి దగ్గరికి డిటెక్టివ్ వెళ్లి గన్ పెట్టి.. మేడమ్ మీరు వెళ్ళండి అని పంపిస్తాడు. రామలక్ష్మి వెళ్ళిపోయాక అభి డిటేక్టివ్ ని బంధీస్తాడు. తన చేతిలో ఉన్న కెమెరాని లాక్కొని నన్నే పట్టించాలని చూస్తావా అని అనుకుంటాడు.ఆ తర్వాత నందినికి అభి ఫోన్ చేసి రామలక్ష్మి తప్పించుకుందని జరిగింది చెప్తాడు. ఆ తర్వాత నందిని టెన్షన్ పడుతుంటే.. ఇప్పుడు రామలక్ష్మి వెళ్లి అభి గురించి సీతాకాంత్ కి చెప్తే.. ఆ అభి గాడు అంతా నువ్వే చేసావని చెప్తాడమోనని హారిక అంటుంది. అలా జరగకూడదు నేను అనుకున్నది జరగాలని నందిని అంటుంది. మరొకవైపు ఇదంతా అత్తయ్య వాళ్ళు నన్ను సీతాకంత్ సర్ ని విడగొట్టాలని చేస్తున్నారా అని రామలక్ష్మి అనుకుంటుంది. వెంటనే వెళ్లి సీతా సర్ కి చెప్పాలి అనుకుంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఎందుకు అభి గురించి రామలక్ష్మి చెప్పడం లేదని కోపంగా ఉంటాడు.

ఆ తర్వాత జరిగింది మొత్తం శ్రీలతకి చెప్తుంది నందిని. ఇప్పుడు రామలక్ష్మి వస్తే.. జరిగింది చెప్తే పరిస్థితి ఏంటని శ్రీలత టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఫోన్ స్విచాఫ్ వస్తుందని అనుకుంటాడు. అప్పుడే ఒక కొరియర్ వస్తుంది. అందులో అభి రామలక్ష్మి ఫోటో ఉంటుంది. అవి చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు. పెద్దాయన చూసి అలా చూసి ఒక అంచనాకి రాకూడదని చెప్తాడు. మీ కంటే ఆ అభి ఎక్కువనా అన్నట్లు శ్రీవల్లి, శ్రీలత నెగెటివ్ గా మాట్లాడి రామలక్ష్మిపై సీతాకాంత్ కి డౌట్ వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.