English | Telugu
Bigg Boss 9 Telugu : కొత్త కెప్టెన్ గా దివ్య.. మాధురి బ్యాక్ బిచ్చింగ్ తో తనూజ ఏడుపు!
Updated : Nov 1, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం క్రేజీగా సాగుతోంది. హౌస్ లో ఎవరు.. ఎప్పుడు.. ఎలా.. ఎవరితో ఉంటున్నారో అర్థం అవ్వడం లేదు.. అప్పుడే కోపాలు.. అప్పుడే అలగడాలు.. అప్పుడే బుజ్జగించడాలు.. ఇవన్నీ అందులో ఉన్నవాళ్ళకి కామన్ అయ్యాయి. చూసేవాళ్ళకి కామన్ అయ్యాయి. కెప్టెన్సీ టాస్క్ లో భరణి తన కూతురు ఇద్దరు టాస్క్ లో ఉన్న ఎవరికి సపోర్ట్ చెయ్యకుండా మిడిల్ లో ఉన్నాడు.
ఇక కెప్టెన్ దివ్య అవుతుంది. అసలు మీరేంటి సపోర్ట్ చెయ్యకుండా సైలెంట్ గా ఉన్నారు.
ఇప్పుడు ఎక్స్ ప్లనేషన్ ఇచ్చే టైమ్ ఇదా అని భరణిపై దివ్య కోప్పడుతుంది. ఇక తనూజ విషయానికి వస్తే దివ్య కెప్టెన్ అవ్వడంతో వెళ్లి ఏడుస్తుంది. తనని ఓదారుస్తూ మాధురి ఉంటుంది. నాన్న నాన్న అంటూ చుట్టూ తిరిగావ్ కదా అవన్నీ ఫేక్ ఇలాంటి టైమ్ వస్తే ఎవరు రారు.. అసలు నీదే తప్పు అని భరణిపై తనుజకి నెగటివ్ ఫీల్ వచ్చేలా రెచ్చగొడుతుంది. దివ్య కి సపోర్ట్ గా సుమన్, గౌరవ్, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, శ్రీనివాస్ సాయి ఉన్నారు. చూసావా వాళ్ళు అందరు భరణి సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు దివ్యకు చేస్తున్నారు.. నీకంటు ఎవరు లేరని తనూజని మాధురి రెచ్చగొడుతుంది. అప్పుడే దివ్య వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది.
నా ప్లేస్ లో ఉంటే నవ్వుకుంటూ ఉండేదానివా అని తనూజ అంటుంది. ఇక అ తర్వాత నాకు సపోర్ట్ చెయ్యలేదని శ్రీనివాస్ సాయితో తనూజ గొడవ పెట్టుకుంటుంది.
ఆ తర్వాత భరణి గారి కుటుంబం అందరు అటు వైపే ఉన్నారు.. అన్నయ్య, బాబాయ్, తమ్ముడు అటువైపే ఉన్నారని రీతు అంటుంది. ఇలా భరణి టీమ్ గురించి మాధురి, రీతూ, డిమాన్, తనూజ మాట్లాడుకుంటారు. అదంతా విన్న తనూజ.. ఇక నుండి ఏ బాండ్ లేదని క్లియర్ గా చెప్తుంది. తర్వాతి నుండి భరణిని నాన్న అని పిలుస్తుందో లేదో చూడాలి మరి.