English | Telugu
Bigg Boss 9 Telugu : భరణి కోసం మాధురి డ్యాన్స్.. అతనికి మాత్రమే సపోర్ట్!
Updated : Nov 1, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం ఒక్కొక్కరి ఆటతీరు ఒక్కోలా ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. భరణికి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. అతనే కెప్టెన్సీ కంటెండర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. భరణి, దివ్య, తనూజ, శ్రీనివాస్ సాయి, నిఖిల్ కెప్టెన్సీ కంటెండర్స్ గా భరణి సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక టాస్క్ విషయానికి వస్తే ఎవరు పేరు అయితే పిలుస్తారో వాళ్ళు వెళ్లి స్టేజ్ పై డాన్స్ చెయ్యాలి.. మరొక స్టేజ్ పై తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి అలా సాంగ్ సాగేవరకూ ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు స్టేజ్ పై ఎంత మంది ఉంటారో వాళ్ళని లెక్కలోకి తీసుకొని ఎక్కువ మంది సపోర్ట్ కలిగి ఉవన్నవాళ్లు కెప్టెన్ అవుతారు.
అలా కంటెండర్స్ అందరు తమకు సపోర్ట్ చెయ్యమని హౌస్ మేట్స్ ని అడుగుతారు. మాధురి దగ్గరికి భరణి వెళ్తాడు. నాకూ సపోర్ట్ చెయ్యండి నా కోసం డాన్స్ చెయ్యండి అని మాధురిని భరణి రిక్వెస్ట్ చేస్తాడు.
అలా మొదట ఛాన్స్ శ్రీనివాస్ సాయికి వస్తుంది. తనకి సపోర్ట్ గా ఒక్కరు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత దివ్యకి ఛాన్స్ రాగా దివ్య కి సపోర్ట్ గా అయిదుగురు ఉంటారు. ఆ తర్వాత నిఖిల్ కి సపోర్ట్ గా ముగ్గురు ఉంటారు. భరణి కి నలుగురు ఉంటారు. భరణికి సపోర్ట్ చెయ్యాలని మాధురి స్టేజ్ పైకి వెళ్తుంది కానీ రీతూ కిందకి లాగేస్తుంది.
చివరగా తనూజ ఉంటుంది. తనకి ఎనమిది మంది ఉంటారు... బిగ్ బాస్ టాప్-2 ఉన్నవాళ్లు ఫైనలిస్ట్ గా సెలెక్ట్ చేస్తాడు. కాసేపటికి ఫైనల్ తనూజ, దివ్యల మధ్య కెప్టెన్సీ పోటీ జరుగుతుంది. ఇద్దరికి చెరొక ఆరుగురు సపోర్ట్ చేస్తూ స్టేజ్ పై ఉంటారు. ఎవరికి సపోర్ట్ చెయ్యకుండా భరణి సైలెంట్ గా మిడిల్ లో ఉంటాడు. తనూజ టీమ్ నుండి నిఖిల్ కిందకి వస్తాడు. ఇక ఎక్కువ సపోర్ట్ ఉన్న దివ్య కెప్టెన్ అవుతుంది.