English | Telugu
రష్మీ గౌనుతో ఆది స్కిట్ అంటా?
Updated : Dec 20, 2021
కోవిడ్ కారణంగా ఓటీటీల హవా మరీ ఎక్కువైపోయింది. అదే తరహాలో బుల్లితెర పై రియాలిటీ షోలు కూడా సందడి చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ఓటీటీలతో పాటు బుల్లితెరపై కూడా విభిన్నమైన రియాలిటీ షోలు మొదలుపెట్టేశారు. ఊహకందని వ్యక్తులు హోస్ట్ లు గా తెరపైకొస్తున్నారు. ఆహా ఓటీటీ కోసం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తూ `అన్ స్టాపబుల్`ని ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక మిల్క్ బ్యూటీ తమన్నా కూడా మాస్టర్ చెఫ్ ఛాలెంజ్ కోసం హోస్ట్ గా వ్యవహరించి ఆ తరువాత అనసూయ పోటీతో తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఈ షోలకు ముందే బుల్లితెరపై హాస్య ప్రియుల్ని ఎంటర్ టైన్ చేస్తున్న రియాలిటీ షో ఎక్స్‌ట్రా జబర్దస్త్.. తాజాగా ఇదే పంథాని అనుసరిస్తూ `శ్రీదేవి డ్రామా కంపనీ` షోని ప్రారంభించారు. ఇదిలా వుంటే న్యూ ఇయర్ సెలబ్రేసన్స్ కోసం ప్రత్యేకంగా ఓ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ని `పెళ్లాం వద్దు.. పార్తీ ముద్దు`గా డిజైన్ చేశారు.
దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో హైపర్ ఆది.. రష్మీనై వేసిన పంచ్‌లు హాట్ టాపిక్ గా మారాయి. ఈ షోకి ఛీఫ్ గెస్ట్ గా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మని ఆహ్వానించారు. ఆయన ముందే హైపర్ ఆది.. రష్మీ గౌన్‌లో స్కిట్ చేసుకుంటానంటూ ఓవర్ డోస్ పంచ్‌లు వేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నెట్టెడ్ గౌన్ వేసుకొచ్చిన రష్మీ ముందు నా గౌన్‌ని సెట్ చేయండి అనడం... ప్రొడక్షన్ వాళ్లె టెంట్ ఎగిరిపోయిందన్నారు ఇక్కడుందా? అని రష్మి గౌన్ ని తాకడం..వంటి సన్ని వేశాలతో తాజా ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఈ షోలో వరుణ్ సందేశ్, వితిక షేరు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.