English | Telugu

"నన్ను పెళ్లి చేసుకుంటావా?".. హ‌రికి అషు మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్‌!

అషురెడ్డి అంటే హరికి ఎంతో ప్రేమ. అందుకు గుర్తుగా గుండెలపై ఆమె పేరు ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండేలా పచ్చబొట్టు కింద వేయించుకున్నాడు. మరి, అషురెడ్డి మనసులో ఏం ఉంది? హరి గురించి ఏం అనుకుంటుంది? అంటే... ఆమెకూ అతడంటే ఇష్టమే. 'కామెడీ స్టార్స్' సాక్షిగా అతడికి ప్రపోజ్ చేసింది. లవ్ ప్రపోజల్ కాదు... మ్యారేజ్ ప్రపోజల్. మరి, హరి ఏం చేస్తాడో? ఏం చెబుతాడో? సండే టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్‌లో చూడాలి.

'హరి గురించి నువ్వు చెప్పాలని అనుకుంటే... క్లియర్‌గా, స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా ఏం చెప్పాలని అనుకుంటున్నావ్?' అని అషురెడ్డిని యాంకర్ శ్రీముఖి అడిగింది. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ల ముందు హీరోలు మోకాళ్ళ మీద కూర్చుని ప్రపోజ్ చేస్తారు కదా. శ్రీముఖి ప్రశ్న తర్వాత అటువంటి సీన్ చోటు చేసుకుంది. అయితే, రివర్స్‌లో!

హరి ముందు మోకాళ్ల మీద కూర్చున్న అషురెడ్డి 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని అడిగింది. ఆమె ప్రపోజల్ తర్వాత న్యాయనిర్ణేత స్థానంలో ఉన్న శ్రీదేవి విజయ్ కుమార్ 'నాకు చాలా ఎమోషనల్ గా ఉంది. యాక్చువల్లీ కంట్లో నీళ్లు వచ్చాయి' అని అన్నారు. ఆ తర్వాత సర్‌ప్రైజ్ అంటూ హరికి ఖరీదైన హైఎండ్ బైక్ ఒకటి బహుమతిగా ఇచ్చింది అషురెడ్డి. తన తల్లితండ్రులు వెయ్యి రూపాయల దుస్తులు కొనిపెట్టారు తప్ప ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వలేదని హరి ఎమోషనల్ అయ్యాడు. అషురెడ్డిని హగ్ చేసుకున్నాడు.

హరి, అషురెడ్డి లవ్ ట్రాక్ 'కామెడీ స్టార్స్'కు అట్రాక్షన్ గా నిలుస్తోంది. అయితే, ఇదంతా షో కోసం చేస్తున్నదని... ఈటీవీలో సుధీర్-రష్మీ లవ్ ట్రాక్ తరహాలో చేయడానికి ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు జనాలు. స్కిట్ కోసం తప్ప నిజ జీవితంలో హరి, అషురెడ్డి మధ్య ఏమీ ఉండదని అంటున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.