English | Telugu
బిగ్‌బాస్ : బిందు మాధవి తొలి అనుభవం అతనితోనే
Updated : Apr 9, 2022
ప్రతీ ఒక్కరి జీవితంలో తొలి ప్రేమ అనుభూతులు కామన్. స్కూల్ డేస్ లో లేదా.. కాలేజీ డేస్ లో .. ఉండే కాలనీలో లేదా వేసవి సెలవులకు వెళ్లిన సందర్భంలో కానీ.. పెళ్లిళ్లల్లో కానీ ఇలాంటి అనుభవం చాలా మందికి ఎదురయ్యే వుంటుంది. ఇలా మొదలైన తొలి ప్రేమ కొంత మంది జీవితాలని మలుపుతిప్పి మధురానుభూతిని కలిగిస్తే మరి కొందరి జీవితాల్లో చేదు జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఇలాంటి ఓ మధురానుభూతిని కలిగించే ఓ ప్రేమకథ తనకూ వుందంటోంది బిందు మాధవి. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో గత కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్న బిందు మాధవి తాజాగా తన క్యూట్ లవ్ స్టోరీని బయటపెట్టింది.
`ప్రతి రోజు నాన్నతో కానీ, ఫ్రెండ్స్ తో కానీ బ్యాడ్మింటన్ ఆడటానికి వెళ్లేదాన్ని. ఆ రోజుల్లో నాకు ఒక స్కూటి ఉండేది. దానిమీదే బ్యాడ్మింటన్ ఆడటానికి వెళ్లేదాన్ని. అక్కడో అబ్బాయి వుండేవాడు. పేరు జెస్ట్ ఆర్.. మీరే ఊహించుకోండి. తను పరిచయం కాలేదు కానీ రోజే నా స్కూటి మీద ఒక ఫ్లవర్ కానీ.. చిన్న బొమ్మకానీ .. చిన్న లెటర్ కానీ .. ఇలా ప్రతీ రోజు ఏదో ఒకటి నా కోసం పెట్టి వెళ్లే వాడు. ఆ తరువాత నేను ఈ రోజు ఏం పెడతాడా? అని ఆసక్తిగా ఎదురుచూసేదాన్ని. ఈ అనుభవం నాకు చాలా థ్రిల్లింగ్ గా సరికొత్తగా అనిపించేది. చాలా హ్యాపీగా ఫీలయ్యేదాన్ని.
అలా చాలా రోజులు జరగడంతో మా పరిచయం కాస్తా అతనిపై ఇష్టంగా మారింది. ఫైనల్ గా ఒకరోజు అతన్ని కలిశాను. అప్పటి వరకు సినిమాల్లో ఊహించుకున్న వన్నీ అతనితో కలిసి చేశాను. అదొక మర్చిపోలేని తొలి అనుభవంగా మిగిలిపోయింది. అప్పటి వరకు బయటి వ్యక్తుల ముందు ఫ్రీగా మాట్లాడలేని నేను తన పరిచయంతో దాన్ని అధిగమించాను. అంతే కాకుండా నాలోని ప్లస్ లు ఏంటో తన వల్లే నాకు తెలిశాయి. మా ఇద్దరిది గ్రేట్ బాండింగ్. ఫస్ట్ లవ్ స్టోరీస్ బ్రేకప్ తో ఎండ్ అవుతుంటాయి. నాకు ఇండిపెండెంట్ గా ఉండాలని నేర్పింది తనే అయితే తను ఇప్పడు వేరే వాళ్లతో వుండొచ్చు కానీ అతని మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వున్నాయి` అని తెలిపింది బిందు మాధవి.