English | Telugu
మాన్సీ కుట్ర ఆర్య వర్థన్ కు తెలిసిపోయిందా?
Updated : Apr 9, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న ధారావాహిక `ప్రేమ ఎంత మధురం`. మరాఠీ సీరియల్ `తులా ఫఠేరా` ఆధారంగా ఈ సీరియల్ ని తెలుగులో రీమేక్ చేశారు. `బొమ్మరిల్లు` వెంకట్ శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించారు. అతనికి జోడీగా వర్ష హెచ్ కె నటించింది. కీలక పాత్రల్లో జయలలిత, బెంగళూరు పద్మ, జ్యోతిరెడ్డి, విశ్వమోహన్, రామ్ జగన్, కరణ్, అనూష సంతోష్ తదితరులు నటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
సుబ్బు ఇంట్లో అను - ఆర్యల శోభనం కు ఏర్పాట్లు చేస్తారు. మిగతా వాళ్లతంతా డాబాపైకి వెళ్లి పడుకుంటారు. అయితే శోభనం గదిలో కాలనీ వాళ్లంతా వచ్చి చేరి పడుకోవడం ఆర్య కు చిరాకు తెప్పిస్తుంది. ఈ విషయం తెలిసి పద్దు - సుబ్బు కిందికి వచ్చేస్తారు. కాలనీ జనాన్ని బయటికి పంపించాలని ప్రయత్నాలు చేస్తారు. అయితే అను చేసిన పనికి అంతా లేచి ఒక్కసారిగా బయటికి వెళ్లిపోతారు. దీంతో ఊపిరి పీల్చుకున్న ఆర్య వర్థన్ శోభనానికి ఇక ఎలాంటి అడ్డు లేదని రెడీ అయిపోతాడు.
అనుని ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా మాన్సీ నుంచి ఫోన్ వస్తుంది. కట్ చేసి వచ్చేయ్ అంటాడు ఆర్య.. అయినా మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తుండటంతో అను లిఫ్ట్ చేస్తుంది. మాన్సీ ఆత్మ హత్య చేసుకుంటానంటూ అరుపులు కేకలు పెడుతూ ఫోన్ కట్ చేస్తుంది. ఊహించని విధంగా మాన్సీ ఆత్మహత్యకు పూనుకుంటాననడంతో ఆర్య - అను ఉన్నపలంగా ఇంటికి వెళతారు. అక్కడికి వెళ్లేససరికి నీరజ్ సోఫాలో గాఢనిద్రలో వుంటాడు. ఆర్య అరవడంతో లేచి ఏం జరిగింది? అంటాడు. మాన్సీ ఆత్మ హత్య చేసుకుంటానంటూ ఫోన్ చేసిందని చెబుతాడు. అదేంటీ ఇప్పడే చికెన్ బిర్యానీ కావాలంటే ఆర్డర్ చేసి ఇచ్చాను. మాన్సీ, ఆమె తల్లి కలిసి తింటున్నారు. తను ఆత్మ హత్య చేసుకుంటాననడమేంటి అంటాడు. ముందు గదిలో ఏం జరుగుతుందో చూద్దాం పద అంటాడు ఆర్య. వెళ్లి గది తలుపులు తెరిచే సరికి నీరజ్ చెప్పినట్టే మాన్సీ - ఆమె తల్లి చికెన్ బిర్యానీ తింటూ కనిపిస్తారు. వాళ్లని చూసి అంతా షాక్ అవుతారు. ఆర్య వర్థన్ కు మాన్సీ - ఆమె తల్లి పన్నిన కుట్ర తెలిసిపోతుందా? .. ఏం జరబోతోంది అన్నది ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.