English | Telugu
అభిమానులకు షాక్.. శ్రీముఖి మళ్లీ బిస్కెట్ వేస్తోందా?
Updated : Apr 9, 2022
అభిమానులకు శ్రీముఖి మరోసారి బిస్కెట్ వేస్తోందా? అంటే అవుననే అనిపిస్తోంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్. తాజాగా `క్యాష్` ప్రోగ్రమ్ లో పాల్గొన్న శ్రీముఖి మళ్లీ పెళ్లి టాపిక్ ఎత్తుకుంది. ఈటీవిలో `పటాస్` తరహాలోనే డిజైన్ చేసిన షో `జాతిరత్నాలు`. ఈ కార్యక్రమానికి శ్రీముఖి ప్రస్తుతం యాంకర్ గా వ్యవహనిస్తోంది. అయితే తన టీమ్ తో కలిసి శ్రీరామనవమి సందర్భంగా `క్యాష్` షో కోసం సుమతో కలిసి స్పెషల్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా తన `జాతిరత్నాలు` టీమ్ ని పరిచయం చేసిన శ్రీముఖి మళ్లీ తన ప్రేమ, పెళ్లిగోలని మొదలుపెట్టింది.
`నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయినప్పటికీ.. ఎంతో మంది అందమైన హీరోలు, కో - యాక్టర్ లతో వర్క్ చేసినప్పటికి ఎవ్వరికీ నా మనసు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా నా మెడలో మూడు ముళ్లు పడకుండా ఉండటానికి కారణమైన ఏకైక వ్యక్తి ఎవరో కాదు..` అంటూ తన మనసు దోచిన ప్రియుడి ని పరిచయం చేసే ప్రయత్నం చేసింది. శనివారం రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానున్న `క్యాష్` స్పెషల్ ఎపిసోడ్ కి సంబంధించిన ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ ఈవెంట్ ద్వారా శ్రీముఖి తన కు కాబోయే వరుడిని నిజంగానే పరిచయం చేయబోతోందా? లేక ప్రోమో కోసమే అలా చెప్పిందా? అన్నది తెలియాలంటే శనివారం రాత్రి 9:30 గంటలకు ప్రసారం అయ్యే `క్యాష్` ఎపిసోడ్ చూడాల్సిందే. గత కొంత కాలంగా శ్రీముఖి లవ్ లో వుందంటూ వరుస కథనాలు వినిపించాయి. అయితే ఈ వార్త వైరల్ అయిన ప్రతీ సారి అలాంటిది ఏమీ లేదని కొట్టి పారేస్తూ వస్తున్న శ్రీముఖి ఇటీవల ఇది తన వ్యక్తిగత విషయమని, దీన్ని ఇంతటితో వదిలేయండని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా `క్యాష్` ప్రోమోలో మాత్రం తను ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవడానికి ఓ వ్యక్తి కారణం అంటూ బాహాటంగానే బయటపెట్టడం.. ఆ వ్యక్తి పేరుని బయటపెట్టే ప్రయత్నం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే శ్రీముఖి తను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి ఎవరో ఈసారైనా బయటపెడుతుందో చూడాలి.