English | Telugu
యశోధర్ - వేదలకు షాకిచ్చిన పేరెంట్స్
Updated : Jan 7, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. స్టార్ మాలో ప్రతీ రోజు రాత్రి 9:30 గంటలకు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం అవుతోంది. బేబీ ఖుషీ బాధ్యతల్ని జడ్జి డా.వేదకు అప్పగించడంతో తనని తమ వైపు తిప్పుకోవాలని అభిమన్యు , మాళివిక మాస్టర్ ప్లాన్ లు వేస్తుంటారు.
ముందు ఖరీదైన నెక్లెస్ ని బహుమతిగా ఇచ్చి వేదని బుట్టలో వేయాలని ప్రయత్నిస్తుంది మాళవిక . కానీ తను ఇచ్చిన ఆఫర్ ని బుధవారం ఎపిసోడ్ లో సున్నితంగా వేద తిరస్కరించడంతో మాళవిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గురువారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. అభిమన్యు డబ్బులు ఎరగా చూపించి వేదని తమ వైపుకి తిప్పుకోవాలని తన మేనేజర్‌ని డబ్బు ఇచ్చిరమ్మని పంపిస్తాడు. అయితే అది యశోధర్ పంపించాడని వేద తప్పుగా అర్థం చేసుకుంటుంది.
Also Read: యష్, వేద మధ్య గొడవకు కారణం?
వెంటనే యశోధర్ ఆఫీస్‌కి వెళ్లి తనని నిలదీస్తుంది. యశోధర్‌ని అవమానిస్తుంది. విషయం తెలియని యశోధర్ కూడా వేదని అవమానించి పంపించేస్తాడు. కట్ చేస్తే .. ఈ కోపంలో యశోధర్ తన తండ్రికి ఫోన్ చేసి పెళ్లి సంబంధం చూశానన్నారు కదా అదే ఓకే చేయండి, పెళ్లి చూపులు ఎక్కడో చెబితే వస్తానంటాడు.. ఇదే తరహాలో వేద కూడా తన తండ్రి ఫోన్ చేయడంతో పెళ్లి చూపులకు నేను రెడీ అని చెప్పేస్తుంది. 7 గంటలకు పెళ్లి చూపులని చెప్పి రిసార్ట్ కి రమ్మంటాడు. ఓ వైపు యశోధర్ ఫ్యామిలీ, మరో వైపు వేద ఫ్యామిలీ ఒకరికి తెలియకుండా ఒకరు అదే రిసార్ట్ కి వచ్చేస్తారు.
పెళ్లి చూపులు వేదకు, యష్ కి అని వీరిద్దరి ఫాదర్‌లకు ముందే తెలుసు. కానీ విషయం ఎవరికీ చెప్పరు. అయితే పెళ్లి చూపులు తమకే అని తెలుసుకున్న వేద , యష్ ఏం చేశారు? .. ఖుషీ కోసం ఒక్కటయ్యారా..? లేక మళ్లీ రిజెక్టెడ్ అంటూ ఒకరిపై ఒకరు బురదజల్లుకున్నారా? .. గిల్లికజ్జాలకు దిగారా? అన్నది తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ చూడాల్సిందే.