English | Telugu
బుల్లితెర స్టార్.. అంత వీజీకాదట!
Updated : Jan 7, 2022
`కార్తీక దీపం` సీరియల్ తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. బుల్లితెర శోభన్‌బాబుగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారాయన. ప్రస్తుతం స్టార్ మాలో 'కార్తీక దీపం', జీ తెలుగులో `హిట్లర్ గారి పెళ్లాం` సీరియల్స్ తో అలరిస్తున్నారు. బుల్లితెర నటుడిగా కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నిరుపమ్ బుల్లితెర స్టార్‌డమ్.. అంత వీజీ కాదు అంటున్నాడు.
ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పాడు. మీ అభిమాన హీరో ఎవరంటే 'విక్టరీ వెంకటేష్' అని చెప్పిన నిరుపమ్ ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని, తను సినిమాలు చేయడానికి ఎప్పుడూ రెడీగానే వున్నానని, ప్రస్తుతం రెండు మూడు ప్రపోజల్స్ నడుస్తున్నాయని.. అయితే సీరియల్స్ లో తనని డాక్టర్ బాబు, హిట్లర్ గా చూసిన జనం ఎలా చూడాలనుకుంటున్నారో తెలియడం లేదని అందుకే ముందు సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
Also Read: 'బంగార్రాజు'లో నామీద చైతూ పైచేయి సాధిస్తాడు!
ఇక బుల్లితెర స్టార్... అనే గుర్తింపు రావడం అంత వీజీ కాదని .. ఆ ట్యాగ్ పెద్ద రిస్క్ అని చెప్పాడు. ఒక సీరియల్ హిట్టవగానే బుల్లితెర స్టార్ అదీ ఇదీ అని పెద్ద పెద్ద ట్యాగ్ లు తగిలేస్తారని.. అవి వింటానికి బాగానే వుంటాయి కానీ వాటితో రిస్కే కానీ పెద్దగా ఉపయోగం అంటూ ఏమీ వుండదని తేల్చేశాడు. "సినిమాల్లోకి రావాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్నా.. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. ఎలాంటి పాత్రలు వస్తాయో వాటిని ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలి" అంటున్నాడు నిరుపమ్.