English | Telugu

దాని కోసం ర‌ష్మి-సుధీర్ క్రేజ్‌ను వాడుకోకండి.. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ వార్నింగ్‌!

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో వైర‌ల్ అయిన జోడీ ర‌ష్మీ గౌత‌మ్ - సుడిగాలి సుధీర్‌. వీరిద్ద‌రిపై వ‌చ్చిన‌న్ని రూమ‌ర్స్‌ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ టీవీ జోడీపై రాలేదు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై వ‌ర్క‌వుట్ కావ‌డంతో అంతా వీరు ప్రేమ‌లో వున్నార‌ని, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని ప్ర‌చారం చేయ‌డం మొద‌లుపెట్టారు. ఎన్ని సార్లు ర‌ష్మీ - సుధీర్ ఇదంగా షో కోస‌మే అని, తామిద్ద‌రం మంచి స్నేహితుల‌మ‌ని వివ‌ర‌ణ ఇచ్చినా వీరిపై ఇప్ప‌టికీ రూమ‌ర్స్‌ ఆగ‌డం లేదు. వారికున్న పాపులారిటీ కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

Also read:సుడిగాలి సుధీర్‌కి ర‌ష్మీ స్ట్రాంగ్ వార్నింగ్!

అయితే గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో వీరిపై వ‌స్తున్న కామెంట్ ల‌కు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌యత్నం చేశాడు. జ‌బ‌ర్ద‌స్త్ లో లేడీ వేషాల‌తో ఆక‌ట్టుకుంటున్న శాంతి స్వ‌రూప్ టీవీ సెల‌బ్రిటీల‌పై వ‌స్తున్న వ‌దంతుల‌కు కౌంట‌ర్ ఇచ్చాడు. ర‌ష్మీ - సుధీర్ జోడీకున్న పాపులారిటీని వాడేస్తూ శాంతి స్వ‌రూప్ డ్రెస్ విష‌య‌మై కొన్ని ఫేక్ వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వాటిపై శాంతి స్వ‌రూప్ మండిప‌డ్డాడు.

యాంక‌ర్ ర‌ష్మీ.. తాను ధ‌రించిన కాస్ట్యూమ్స్ శాంతి స్వ‌రూప్ కి ఇచ్చిందంటూ నెట్టింట ట్రోలింగ్ మొద‌లైంది. శాంతి స్వ‌రూప్ లేడీ గెట‌ప్ కు సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేస్తూ ఇదిగో ప్రూఫ్ అంటూ ప్ర‌చారం చేయ‌డం మొద‌లుపెట్టారు. అంతే కాకుండా ర‌ష్మీ ఈ డ్రెస్ ని శాంతి స్వ‌రూప్ కు ఇవ్వ‌డం వెన‌క ఓ కార‌ణం కూడా వుందంటూ కామెంట్ లు చేశారు. ఈ పోస్ట్ లు చూసిన శాంతి స్వ‌రూప్ ట్రోల‌ర్స్ కి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు.

Also read:హైప‌ర్ ఆది పెళ్లి సీక్రెట్ చెప్పేశాడు

"త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌కండి. ఆ కాస్ట్యూమ్స్ నచ్చి నేనే రెడీ చేయించుకున్నాను. కానీ నిజానిజాలు తెలియ‌కుండా మీరు ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌డం దారుణం. మీ పేజీని పాపుల‌ర్ చేసుకోవ‌డం కోసం ఇలాంటి పోస్ట్ లు పెట్ట‌కండి... మా లాంటి వారితో ఆడుకోకండి.. అంతే కాకుండా మీరు పాపుల‌ర్ కావ‌డం కోసం సుధీర్ - ర‌ష్మీల క్రేజ్ ని వాడుకోకండి" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు శాంతి స్వ‌రూప్‌. ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

" width="400" height="700" layout="responsive">

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.