English | Telugu

యష్మీ-గౌతమ్ ల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్.. నిఖిల్ కి జెలస్ అంట!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ సీజన్ లో లాగే ఈ సీజన్ లోను ఆర్య-2 ట్రాయాంగిల్ లవ్ ట్రాక్ నడుస్తుంది. గౌతమ్ కి యష్మీ అంటే ఇష్టం అది స్వయంగా తనే యష్మీతో చెప్పుకొచ్చాడు. యష్మీకి నిఖిల్ అంటే ఆ విషయం కూడా తనే స్వయంగా చెప్పుకొచ్చింది.

నిఖిల్ మాత్రం ఈ విషయంలో బయటపడడం లేదు.. యష్మీ తన మనసులో మాట చెప్పినప్పుడు నిఖిల్ ఏ సమాధానం చెప్పకుండా ఉన్నాడు. ఆ తర్వాత కిచెన్ లో ఉన్న యష్మీ దగ్గరికి వచ్చి నుదుటి పై ముద్దు పెట్టాడు.

నిన్న జరిగిన ఎపిసోడ్ లో యష్మీ నిఖిల్ లు సరదాగా గొడవ పడుతుంటారు. నాపై ఏ హోప్స్ పెట్టుకోకని నిఖిల్ అనగానే.. ఏంటి అలా అంటున్నావ్.. నాకేం తక్కువ.. నాకు ఎవరు దొరకరన్నట్టు ప్రతీసారీ హోప్ పెట్టుకోకు అంటున్నావ్.. నాకు పృథ్వీ ఎలాగో నువ్వు కూడా ఇక అంతే అంటూ కాస్త పొగరుగా చెప్పేసి యష్మీ అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత యష్మీ, ప్రేరణ ఇద్దరు ఆ విషయం గురించి మాట్లాడుకుంటారు. అలా ప్రతిసారీ అంటే నాకు నిజంగా హర్టింగ్ గా ఉంటుందని యష్మీ అంటుంది. నబీల్ తో నిఖిల్ అన్న విషయం ఏంటో తెలిసిందా అని ప్రేరణ అడుగుతుంది. హా తెలిసింది.. నేను గౌతమ్ తో డాన్స్ చేస్తుంటే నిఖిల్ జెలస్ గా ఫీల్ అయ్యాడంట అని యష్మీ చెప్పుకొచ్చింది. ఈ లెక్కన గౌతమ్ తో యష్మీ ఉండడానికి కారణం నిఖిల్ జెలస్ ఫీల్ అవ్వాలనే అన్నమాట. మరొకవైపు యష్మీ, గౌతమ్ ల గొడవలో గౌతమ్ మాట్లాడుతుంటే.. యష్మీ వెళ్ళిపోతుంది. మాట్లాడుతుంటే ఎలా వెళ్ళిపోతుంది.. అదేనా రెస్పెక్ట్ అని గౌతమ్ తో తేజ అంటాడు. మనకి అవసరం లేదు.. రెస్పెక్ట్ లేనిది ఎవరు వద్దని యష్మీపై గౌతమ్ కోపంగా మాట్లాడతాడు. అదంతా కంటెంట్ కోసమే.. నిజంగానే ఏం అర్థం అవ్వడం లేదు.. ఏ విషయం అయిన హౌస్ నుండి బయటకు వచ్చాకే క్లారిటీ వస్తుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.