English | Telugu

తోప్ కంటెస్టెంట్ కి ఎలిమినేషన్ తప్పదు.. సీక్రెట్ రూమ్ ఆ డబుల్ ఎలిమినేషనా!


బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో తమకంటూ ఎంతో కొంత ఫాలోయింగ్ ఉండి ఎంట్రీ ఇచ్చినవాళ్లే. అయితే హౌస్ లో తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించిన వాళ్లే చివరి వరకు ఉంటారు. అయితే ఇప్పటికే హౌస్ నుండి ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.

ఇక ఈ వారం హౌస్ నుండి ఎవరు బయటకు వస్తారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. ప్రస్తుతం నామినేషన్ లో నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, మెహబూబ్, పృథ్వీ, నయని పావని మొత్తంగా ఆరుగురు ఉన్నారు. ఇక ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ప్రేరణ ఉంది. నిఖిల్ సెకెండ్ ప్లేస్ లో ఉన్నారు. మూడో స్థానంలో విష్ణుప్రియ ఉండగా నాల్గవ స్థానంలో పృథ్వీ ఉన్నాడు.

ఇక డేంజర్ జోన్ లో నయని పావని, మెహబూబ్ ఇద్దరున్నారు. ఇక ఈ వారమంతా హౌస్ లో మెహబూబ్ కాస్త గేమ్ ఆడాడు.‌ కానీ నయని పావని ఏం ఆడలేదు. ఎప్పుడు చూసిన ఏడుపే.. హౌస్ లో క్రైయింగ్ బేబీ అని పేరు తెచ్చుకున్న నయనికి ఈ వీకెండ్ లో క్రైయింగ్ తప్పదేమోననిపిస్తుంది. అయితే బిగ్ బాస్ మామ మరోలా ప్లాన్ చేసే అవకాశం ఉంది. అదేంటంటే గంగవ్వ హౌస్ లో ఉన్నా పెద్దగా పర్ఫామెన్స్ లేదు పైగా తోటి కంటెస్టెంట్స్ మీద చిరాకు పడటం.. ప్రతీసారీ ఇదే రిపీట్ అవుతుంది. రాయల్స్ - ఓజీ క్లాన్ ల మధ్య టాస్క్ లు భారీగా జరుగుతున్నాయి. వాటిల్లో గంగవ్వ పార్టిసిపేషన్ లేదు కాబట్టి తనని ఎలిమినేషన్ చేసి.. ఈ వారం లీస్ట్ లో ఉన్న నయని పావనిని లేదా మెహబూబ్ ని సీక్రెట్ రూమ్ లో పెట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే హౌస్ లో కంటెస్టెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఫుడ్ దగ్గర టాస్క్ లలో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. మరి మన బిగ్ బాస్ మామ డబుల్ ఎలిమినేషన్ చేసి అందరికి షాకిచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఈ రెండు కాకుండా పృథ్వీ-విష్ణుప్రియ మధ్య ఫేక్ లవ్ అనేది చాలా ఇబ్బందిగా మారింది. తోటి హౌస్ మేట్స్ అంతా వాళ్ళిద్దరి వల్ల టాస్క్ లో కూడా సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వడం లేదు. మరి వీరిలో లీస్ట్ లో ఉన్న నయని, మెహబూబ్ లని పక్కన బెట్టి వారిపైన ఉన్న పృథ్వీని బయటకు పంపిస్తాడో లేదో చూడాలి మరి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.