English | Telugu

మెగా ఛీఫ్ టాస్క్ లో పృథ్వీకి వెన్నుపోటు పొడిచిన హరితేజ!

బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్లీ స్ట్రాంగ్ ఎవరంటే అందరు పృథ్వీ అనే అంటారు. అగ్రెసివ్ ఎవరంటే కూడా ఠక్కున పృథ్వీ అంటారు. హౌస్ లో తమ క్లాన్ లో తప్ప మిగతా హౌస్ మేట్స్ కి పృథ్వి నచ్చడు.

నిన్న మొన్నటివరకు పృథ్వీ-విష్ణు అంటూ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. నీపై ఎలాంటి ఫీలింగ్ లేదని విష్ణుప్రియ మొహంపైనే పృథ్వీ చెప్పడంతో రెండు రోజులుగా ఇద్దరు ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. అయితే నిన్న జరిగిన మెగా చీఫ్ టాస్క్ లో రాయల్స్ నుండి ఇద్దరు ఓజీ నుండి నలుగురు కంటెండర్ షిప్ రేసులో నిలిచారు. ఇక చివరి మెగా చీఫ్ టాస్క్ లో.. టేస్టీతేజ ఉండగానే పృథ్వీని తీసేయాలంటూ హరితేజ తన క్లాన్ తో చెప్పింది. మనకి మెగా చీఫ్ గా ఫస్ట్ తేజ అవ్వాలి..కానీ వాళ్లు ఎలాగైనా తనని తీసేస్తారు.. తేజని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అలాగే హౌస్ కి మంచి మెగా చీఫ్ ని సెలక్ట్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.. ఈ పృథ్వీని మనం టాస్క్ లోనే భరించలేం.. ఇక మెగా చీఫ్ అయితే వారమంతా ఎలా భరిస్తామని తన క్లాన్ వాళ్ళని రెచ్చగొట్టింది హరితేజ. ఇక ఆ తర్వాత మిరపకాయని రాయల్ క్లాన్ లోని అవినాష్ పట్టుకోవడంతో.. పృథ్వీని తీసేశాడు. ఈ రకంగా పృథ్వీని మెగా ఛీఫ్ కాకుండా చేసింది హరితేజనే.

పృథ్వీ ఈ వారమంతా హౌస్ లోని జరిగిన అన్నీ టాస్క్ లు సూపర్ గా ఆడావ్ అంటు మొదట మెచ్చుకున్న అవినాష్.. మా క్లాన్ నుండి మెగా ఛీఫ్ కావాలంటూ కవర్ చేసుకున్నాడు. దాంతో అసలు విషయం తెలియని పృథ్వీ సరేనని లైట్ తీసుకున్నాడు. అదే హరితేజ తనని తప్పించాలని తన క్లాన్ తో చెప్పిందని తెలిస్తే ఇక పృథ్వీ చేతిలో హరితేజ కథ కాస్త బుర్రకథ అవుతుందేమో. మరి తమ క్లాన్ లోని సీక్రెట్స్ అన్నీ పక్క క్లాన్ కి చేరవేసే నయని పావని ఈ విషయం ఎవరికైనా చెప్తుందా లేక మరెవరైనా పృథ్వీకీ తెలిసేలా చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.