English | Telugu
బిగ్‌బాస్ : మానస్.. కాజల్ మైండ్‌గేమ్.. చిటపటలాడిన ఆనీ
Updated : Nov 20, 2021
బిగ్‌బాస్ సీజన్ 5 ఎండింగ్‌కి రోజులు దగ్గరపడుతున్నా కొద్దీ గేమ్ రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఇంటి సభ్యుల మధ్మయ వున్న అసలైన బంధాలు.. ప్రేమలు.. త్యాగాలు బయటపడుతున్నాయి. అంతే కాకుండా కంటెస్టెంట్‌ల మధ్య దూరం.. రోజు రోజుకీ పెరిగిపోతూ గొడవలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. దీనికి బిగ్‌బాస్ పెడుతున్న టాస్క్‌లు కూడా ఇంటి సభ్యుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి.
నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఇంటి సభ్యుల మధ్య పెద్ద చిచ్చే పెట్టాడు. 75వ ఎపిసోడ్ లోకి ఎంటరైన హౌస్ మేట్స్ తమని తాము కాపాడుకోవడానికి .. పోటీలో గెలవడానికి ఆసక్తికర ప్లాన్‌లని సిద్ధం చేసుకున్నారు. యాంకర్ రవి .. శ్రీరామచంద్ర అండ్ కోని కలుపుకుంటూ కొత్త ఎత్తులు వేయడం గమనార్హం. ఇది గమనించిన సన్నీ, కాజల్, మానస్స, ప్రియాంకలు కూడా తమ ప్లాన్‌ని సిద్ధం చేసుకుని రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే మానస్ ఇంటి కెప్టెన్ కావడంతో సన్నీ, కాజల్ హ్యాపీగా ఫీలయ్యారు.
`నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా` అనే టాస్క్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా మొదటి సైరన్ మోగిన వెంటనే ముందు ఎవరైతే ఫైర్ ఇంజిన్‌లోకి ఇద్దరు వ్యక్తులు ఎక్కాల్సి వుంటుంది. ఆ ఇద్దరు ఒక ఇంటి సభ్యుడిని కాపాడాల్సి వుంటుంది. ఈ టాస్క్‌లో గెలిచిన వారికి ఫ్రీ ఎవిక్షన్ పాస్ సొంతం అవుతుంది. దీంతో కంటెస్టెంట్‌లు అంతా తమ పూర్తి ఎఫర్ట్‌ని పెట్టడానికి రెడీ అయిపోయారు. ఇక్కడే మానస్, కాజల్ మైండ్ గేమ్ ఆడారు. ఈ టాస్క్‌లో సిరి, ఆనీ ఫొటోల్లో ఒక్కరి ఫొటో కాలకుండా చూడాలి.
అయితే ఈ ఇద్దరి ఫొటోలని తెలివిగా కాలిస్తే సన్నీ సేవ్ అవుతాడు ఈ విషయాన్ని ముందు పసిగట్టిన మానస్, కాజల్ ఒకు సిరి అంటే మరొకరు ఆనీ అంటూ చివరి వరకు గేమ్ ఆడీ ఇద్దరి ఫోటోలు కాలిపోయేలా చేశారు. చివరికి సన్నీని అనుకున్నట్టే సేవ్ చేసుకున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆనీ మాస్టర్ కాజల్ ఆడిన గేమ్‌ని తప్పుబడుతూ మండి పడింది. తొండిగేమ్ అంటూ ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.