English | Telugu

అనుని భ‌య‌పెట్టిన టెడ్డీబేర్ ఎవ‌రు?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. జీ తెలుగులో గ‌త కొన్ని వ‌రాలుగా ప్ర‌సారం అవుతున్నఈ సీరియ‌ల్ కు మ‌రాఠీ సీరియ‌ల్ `తుల ఫ‌ఠేరే` ఆధారం. శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష‌, రామ్ జ‌గ‌న్‌, జ‌య‌ల‌లిత‌, విశ్వ‌మోహ‌న్‌, జ్యోతిరెడ్డి, అనుషా సంతోష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. జీ తెలుగులో రేటింగ్ ప‌రంగా ముందు వ‌రుస‌లో వుంది.

Also read:ఆర్య‌వ‌ర్ధ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా?

గురువారం హైలైట్ స్ ఏంటో చూద్దాం. మాన్సీ రాక‌పోవ‌డంతో నీర‌జ్ కంగారుప‌డుతూ వుంటాడు. ఇంత‌లో మాన్సీ ఫుల్లుగా తాగేసి తూలుతూ వ‌స్తూ వుంటుంది. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మాన్సీ .. మామిల్లా త‌మ్ముంటే కిందిరిరా అంటూ అరుస్తుంటుంది. అదే స‌మ‌యంలో త‌న త‌ల్లి నిర్మ‌లాదేవి కిందికి దిగుతుండ‌టం గ‌మ‌నించిన నీర‌జ్.. త‌న భార్య నోరు మూసి గ‌దిలోకి తీసుకెళ‌తాడు. ఆ దృశ్యం నీర‌జ్ త‌ల్లి కంట‌ప‌డుతుంది. వెంట‌నే త‌న‌కి క‌ళ్లు తిరిగి అలా చేస్తోంద‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తాడు.

క‌ట్ చేస్తే.. గెస్ట్ హౌస్ లో వాలెంటైన్స్ డే సెల‌బ్రేష‌న్స్ అంటూ అక్క‌డే వుండిపోయిన ఆర్య‌వ‌ర్ధ‌న్‌.. అనుతో రొమాంటిక్ ఆట‌లు ఆడుతూ మొత్తానికి లిప్ లాక్ లాగించేస్తాడు. క‌ట్ చేస్తే.. ఆర్య‌వ‌ర్ధ‌న్ క‌నిపించ‌క‌పోవడంతో ఎక్క‌డ వున్నార‌ని అను వెతుకుతూ వుంటుంది. ఇంత‌లో అనురూమ్‌లో టెడ్డీ బేర్ గెట‌ప్ లో ఎంట్రీ ఇచ్చిన ఓ యువ‌కుడు అనుని భ‌య‌పెట్ట‌డం మొద‌లుపెడ‌తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. ఇంత‌కీ టెడ్డీబేర్ రూపంలో వ‌చ్చింది ఎవ‌రు? .. ఆ వ్య‌క్తిని ఆర్య‌వ‌ర్ధ‌నే ఏర్పాటు చేయించాడా? .. దీనిపై అను రియాక్ష‌న్ ఏంటీ? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.