ఆర్యవర్ధన్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
on Feb 15, 2022

బుల్లితెరపై ఆకట్టుకుంటున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీని తలపిస్తున్న ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది. `బొమ్మరిల్లు` ఫేమ్ వెంకట్ శ్రీరామ్, వర్ష ప్రధాన జంటగా నటించారు. బెంగళూరు పద్మ, విశ్వమోహన్, రామ్ జగన్, జయలలిత, జ్యోతిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. గత కొన్ని వారాలుగా అనూహ్య మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ వీక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది.
రాగసుధ తన తల్లిదండ్రుల వద్దే వుందని తెలుసుకున్న అను వెంటనే తనని కలవాలని, మాట్లాడాలని టిఫిన్ తండ్రి సుబ్బు నడుపుతున్న టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేస్తుంది. అక్కడ రాగసుధ ని కలిసి తను నా అక్క అనడంతో సుబ్బు షాక్ కు గురవుతాడు. తను నీకు అక్క ఏంటి బుజ్జమ్మా అంటూ అనుని అడుగుతాడు. ఆ విషయం పట్టించుకోకుండా అను సుబ్బు పై సీరియస్ అవుతుంది. ఇలా అక్కతో పని చేయించడం ఏమీ బాగాలేదంటుంది. అను ఏం మాట్లాడుతుందో.. ఎందుకు ఇలా మాట్లాడుతుందో రాగసుధతో పాటు, సుబ్బుకు అర్థం కాదు.
Also Read: చేతికి చిక్కిన వశిష్టకు చుక్కలు చూపిస్తున్న జెండే
కట్ చేస్తే ...వశిష్టని బంధించిన చోట జెండే .. ఆర్య వర్థన్ కోసం ఎదురుచూస్తుంటాడు. అక్కడికి ఆర్యవర్థన్ రావడంతో రాగసుధని పట్టుకునే క్రమంలో మనం ఫాలో అవుతున్న ప్లాన్ కరెక్ట్ కాదేమో.. ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారిస్తే మంచిదేమో అంటాడు జెండే.. వెంటనే మాస్టర్ ప్లాన్ వేసిన ఆర్యవర్థన్ .. వశీష్టని వదిలెయ్ అంటాడు. ఆర్య మాటలకు షాక్ అయిన జెండే.. ఆర్యా ఏం మాట్లాడుతున్నావని విస్మయం వ్యక్తం చేస్తాడు. పెద్ద చేపకు వలేస్తే చిన్న చేప ఇరుక్కుంది. అదే చిన్న చేపని ఎరగా వేసి పెద్ద చేపను పట్టుకుందాం` అంటాడు ఆర్య. ఆ మాటలు విన్న జెండే ఆలోచన బాగుంది అంటాడు..
Also Read: రాగసుధకు అను గత జన్మ రహస్యం చెప్పేస్తుందా?
వెంటనే వశిష్టని వదిలి పెట్టి అతను రాగసుధ వద్దకు వెళ్లగానే ఇద్దరిని చంపేయాలని తన అనుచరులకు సూచిస్తాడు జెండే. అనుకున్నట్టే తప్పించుకున్న వశిష్ట .. రాగసుధ ని వెతుక్కుంటూ వెళుతుంటాడు. అతనికి తెలియకుండా జెండే మనుషులు వెంటాడుతుంటారు. ఇంతకీ ఆర్యవర్థన్ వేసిన మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయ్యిందా?.. రాగసుధ.. ఆర్యవర్ధన్ వలలో చిక్కిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



