English | Telugu

వన్ వీక్ హోస్ట్ గా వీజే సన్నీ

బిగ్ బాస్ సీజన్ 6 లో సామాన్యుల‌కు అవకాశం ఇచ్చింది స్టార్ మా. ఐతే ఇప్పటికే ఈ హౌస్ లోకి వెళ్ళడానికి అప్లై చేసుకున్న వాళ్ళతో వన్ వీక్ గేమ్ ఆడించి అందులో విన్ ఐన వాళ్ళను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నారు. అనుకున్నట్టుగానే వీళ్ళతో ఒక వారం గేమ్ ఆడించారు. ఈ వన్ వీక్ ప్రోగ్రాం కి బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హోస్ట్ గా చేశాడు. దీని షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.

ఇక ఈ సీజన్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా మళ్ళీ రాబోతున్నారట. వీళ్ళు వచ్చి సామాన్యుల‌తో హౌస్ లో గేమ్స్ ఆడించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 6 షో అనేది సెలబ్రిటీస్ v/s కామన్ మాన్ షోగా మారబోతోంది. ఐతే కామన్‌మెన్‌ తో నిర్వహించే ఈ షోలో ఎలాంటి కొత్త గేమ్స్ ఆడించబోతున్నారు ? ఎలాంటి టాస్క్స్ ఇవ్వబోతున్నారు. ? అసలు కామ‌న్‌మెన్‌కు, సెలబ్రిటీస్ కి మధ్య ఎలాంటి ఇంటరెస్టింగ్ విషయాలు జరగబోతున్నాయి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.