English | Telugu

డ్రైవింగ్ రాని హైపర్ ఆది యాక్సిడెంట్ చేశాడా?

టీఆర్పీ రేటింగ్స్ కోసం టీవీ షోల నిర్వాహకులు రకరకాల డ్రామాలకు తెరదీస్తారు. తాజాగా అలాంటి డ్రామాకే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో వేదికైంది. ప్రతి ఆదివారం మ‌ధ్యాహ్నం 1:00 గంట‌కు ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షో 12వ తేదీకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో హైపర్ ఆదిని రియల్ పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు చూపించడం హాట్ టాపిక్ గా మారింది.

'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ప్రోమోలో ఇద్దరు పోలీసులు నానా హంగామా చేశారు. హైపర్ ఆది యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని ఆసుపత్రిపాలు చేశాడని, అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చామంటూ పోలీస్ స్టోరీలో సాయి కుమార్ రేంజ్ లో రెచ్చిపోయారు. అంతేకాదు తమకి ఎదురు మాట్లాడిన వాళ్ళని కొట్టినంత పని చేశారు. దీంతో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని వచ్చే ఆదివారం ఎపిసోడ్ కోసం కొందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి ప్రోమోలతో మమ్మల్ని నమ్మించలేరు, మా దగ్గర మీ పప్పులుడకవు అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

'యాక్సిడెంట్ చేసిన హైపర్ ఆది అరెస్ట్' అంటూ ప్రోమో బాగానే కట్ చేశారు గానీ అందులో పెద్ద లాజిక్ మర్చిపోయారని నెటిజన్లు అంటున్నారు. నిజానికి ఆదికి డ్రైవింగ్ రాదు. ఈ విషయాన్ని ఆదినే పలు సందర్భాల్లో చెప్పాడు. మరి అసలు డ్రైవింగ్ రాని వ్యక్తి యాక్సిడెంట్ ఎలా చేస్తాడు? అంటూ నెటిజన్లు లాజిక్ తీస్తున్నారు. ఇంకా కొందరైతే "పోలీసు అన్నల యాక్టింగ్ బాగుంది.. మంచు ఫ్యూచర్ ఉంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.