English | Telugu
బెడిసికొట్టిన శోభ ప్లాన్.. స్వప్నకు నిరుపమ్ షాక్
Updated : Jun 7, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ సీరియల్ తాజాగా కొంత వరకు ఆ క్రేజ్ ని కోల్పోయిందనే చెప్పాలి. అయినా సరికొత్త పాత్రలతో సరికొత్త ట్విస్ట్ లతో ఇప్పుడిప్పుడే గాడిన పడుతూ విజయవంతంగా సాగుతోంది. జూన్ 7 మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరగనుందో ఇప్పడు తెలుసుకుందాం. హిమ కారణంగా శోభ చేసిన పని తెలిసి నిరుపమ్ శోభని అసహ్యించుకుంటాడు. జరిగిన తప్పుకు జ్వాలకు సారీ చెబుతాడు.
నాకు కోపం ఏమీ లేదు. మీరు ఏమన్నా పడతాను అంటుంది జ్వాల. అదే సమయంలో హిమని అభినందిస్తుంది. ఇదంతా గమనించిన స్వప్న నా పరువు తీశావంటూ శోభపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. హిమని అభినందిస్తుంది. ఇదిలా వుంటే నువ్వు శోభని పెళ్లి చేసుకోక తప్పదు అని నిరుపమ్ తో అంటుంది స్వప్న. ఆ మాటలకు ఆగ్రహించిన నిరుపమ్.. నా పెళ్లి నా ఇష్టం. కాపురం చేయాల్సింది నేను. ఈ విషయంలో మీకు ఎలాంటి హక్కు లేదు అన్నట్టుగా మాట్లాడతాడు.
అంతే కాకుండా నాకు కాబోయే భార్యను నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అది తప్పు కదా అని స్వప్నని నిలదీస్తాడు. నేను చెప్పినట్టు వినకపోతే మీ అమ్మ బ్రతికి వుండదు అంటూ నిరుపమ్ కు వార్నింగ్ ఇస్తుంది స్వప్న. మరో పక్క హిమ తను పంపిన వీడియో చూడలేదని ప్రేమ్ తెగ ఫీలైపోతుంటాడు. కట్ చేస్తే.. నిరుపమ్ ని సత్య వాళ్ల ఇంట్లో చూసిన జ్వాల షాక్ అవుతుంది. ఏంటీ నువ్వు ఇక్కడున్నావ్ అంటుంది. అప్పుడు నిరుపమ్ హిమని గుర్తు చేసుకుంటూ ఓ మాట అంటాడు. అది తననే అని జ్వాల మురిసిపోతుంది. ఆ తరువాత ఏం జరిగింది? జ్వాల విషయంలో స్వప్న ఏం చేసింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.