English | Telugu

బిగ్‌బాస్ ఓటీటీ లిస్ట్ ఫైన‌ల్ అవుతోందా?


తెలుగులో బుల్లితెర‌పై ప్ర‌సారం అయ్యే రియాలిటీ షో బిగ్‌బాస్ కి వున్న క్రేజే వేరు. ఇందులోకి వెళ్లి బ‌య‌టికి వ‌చ్చిన చాలా మంది పాపుల‌ర్ అయ్యారు. కెరీర్ ప‌రంగా ఓ మెట్టు ఎక్కేశారు. ప్ర‌స్తుంత వ‌రుస అవ‌కాశాల‌తో బిజీగా వున్నారు. దీంతో బిగ్‌బాస్ కు తెలుగులో మ‌రింత‌ క్రేజ్ ఏర్ప‌డింది. ఈ షోలో పాల్గొనాల‌ని చాలా మంది ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. మ‌రో రెండు నెల‌ల్లో సీజ‌న్ 6 ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఓటీటీ సీజ‌న్ అంటూ కొత్త‌గా చ‌ర్చ మొద‌లైంది.

బుల్లితెర తో పాటు ఓటీటీ ఫార్మాట్ లోనూ బిగ్‌బాస్ వీక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతోంది. ఇందుకు సంబంధించిన వార్త‌ని నాగార్జున ఇటీవ‌ల స్వ‌యంగా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ ఓటీటీ సీజ‌న్ కు ఓంకార్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని, ఇది 24 అవ‌ర్స్ ఫార్మాట్ లో వుంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓటీటీ బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీరే అంటూ రోజుకో పేరు తెర‌పైకి వ‌చ్చేస్తోంది.

కొత్త‌గా యాంక‌ర్ వ‌ర్షిణి, యాంక‌ర్ శివ ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. గ‌త సీజ‌న్ కోసం వీరు పోటీప‌డ్డారు. కానీ అవ‌కాశం ద‌క్క‌లేదు. అలా అవ‌కాశం ద‌క్క‌ని వీరికి ఓటీటీ బిగ్‌బాస్ లో చోటు ద‌క్కిన‌ట్టుగా చెబుతున్నారు. అంతే కాకుండా వీరితో పాటు టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, వైష్ణ‌వి, సోష‌ల్ మీడియా స్టార్ వ‌రంగ‌ల్ వంద‌న‌, యాంక‌ర్ ప్ర‌త్యూష ల పేర్లు కూడా ఫైన‌ల్ లిస్ట్ లో వున్న‌ట్టుగా చెబుతున్నారు. అయితే వీళ్ల‌లో యాంక‌ర్ శివ‌, వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్‌, వైష్ణ‌వి ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.